Today Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర
17 July 2022, 6:02 IST
- కొన్ని రోజులుగా పైపైకే ఎగబాకుతున్న ధరలు కాస్త తగ్గాయి. శనివారం, ఆదివారం పసిడి ధర దిగొచ్చింది. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. పసిడి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, ఉక్రెయిన్ - రష్యా యుద్ధం వంటి అంశాల కారణంగా.. ధరలు పైపైకి వెళ్లాయి. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా.. ఇవాళ కూడా దిగివచ్చింది. తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,400గా నమోదైంది. నిన్నటితో పోల్చుకుంటే సుమారు 300 రుపాయల వరకూ తగ్గింది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కొనేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు వెడి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కాస్త పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండిపై 30 రూపాయలు పెరిగి.. ధర రూ.60,700గా ఉంది. విజయవాడ, విశాఖ పట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు దేశంలోనూ బంగారం ధరలు తగ్గాయి. దేశంలో బంగారం ధరలు శనివారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 దిగొచ్చి.. రూ. 46,200కి చేరింది. శనివావారం ఈ ధర రూ. 46,500గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 430 తగ్గి.. రూ. 50,400కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,730గా ఉండేది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం రేట్లు తగ్గాయి. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,200 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,400గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,270గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,480గాను ఉంది. పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,280గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,480గాను ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు.. బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలుగా తెలుస్తోంది.
వెండి ధరలు
దేశంలో వెండి ధరలు శనివారం నాడు భారీగా తగ్గగా.. ఆదివారం నాడు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. కేజీ వెండి రూ.55,600కు చేరింది. శనివారం ఈ ధర రూ. 55,000గా ఉండేది. వెండి ధరలు కోల్కతాల్ 55,600.. బెంగళూరులో 60,700.. ముంబయిలో 55,600.. చెన్నైలో 60,700గా ఉన్నాయి.