తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

TS 10th Results 2024: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే

Sarath chandra.B HT Telugu

30 April 2024, 7:17 IST

    • Manabadi 10th SSC results telangana: తెలంగాణ పదోతరగతి పరీక్షా ఫలితాలు ఉదయం 11 గంటలకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు  రాష్ట్ర వ్యాప్తంగా 5.08లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. 
నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు
నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు

నేడు తెలంగాణ పదో తరగతి ఫలితాలు

TS SSC 10th 2024 Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఉదయం 11 గంటలకు ఇక్కడ తనిఖీ చేసుకోవచ్చు. ఈ కింది బాక్స్‌లో మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి రిజల్ట్స్ చూసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

20 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం Secretary Education హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలు విడుదల కాగానే క్షణాల వ్యవధిలో HT తెలుగు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. 

హెచ్.టి.తెలుగులో పదో తరగతి ఫలితాలు(TS 10th Results in HT Telugu)

పదో తరగతి విద్యార్థులు హెచ్.టి.తెలుగు వెబ్ సైట్ లో సింగిల్ క్లిక్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ దిగువన ఉన్న లింక్ లో మీ రోల్ నెంబర్ యాడ్ చేసి సబ్మిట్ కొట్టగానే ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. విద్యార్థులు మార్కుల తనిఖీ చేసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు(TS 10th Exams) మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరంతా టెన్త్ ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికి ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించారు.

తెలంగాణ పదో తరగతి ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in/ , https://results.bsetelanganagov.in/ లలో కూడా తనిఖీ చేసుకోవచ్చు.

పది మెమోలపై పెన్ నెంబర్

తెలంగాణ పదో తరగతి ఫలితాలను(TS SSC Results 2024 date) ఈ నెల 30న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.

పదో తరగతి ఫలితాల విడుదల అనంతరం https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు మార్కులు తెలుసుకోవచ్చు. మరోవైపు తొలిసారిగా తెలంగాణలో పదో తరగతి మెమోలపై పెన్(Permanent Education Number) నెంబర్ ముద్రించనున్నారు.

ఉద్యోగార్థులకు ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ (PEN)ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన 'పెన్' నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్ (Permanent Education Number) సెక్యూరిటీ ఫీచర్లతో కూడినదిగా ఉంటుంది. 

విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. పెన్ నెంబర్ ఆధారంగా… ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు (Telangana SSC Results 2024) మంగళవారం విడుదల కానున్నాయి. మంగళవారం (ఏప్రిల్‌ 30న) ఉదయం 11 గంటలకు ఈ పరీక్షల ఫలితాల (TS 10th Results)ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ పదో తరగతి పరీక్ష(TS SSC Exams) కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (TS SSC Spot Valuation 2024) ఇప్పటికే పూర్తైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యూయేషన్‌ ప్రారంభించారు. ఏప్రిల్ 13తో టెన్త్ స్పాట్ ప్రక్రియ పూర్తైంది. స్పాట్ వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాలలో నిర్వహించారు.

2023లో తెలంగాణ పదో తరగతి ఫలితాలు…. మే 10వ తేదీన వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీతో పరీక్షలు ముగిశాయి. ఈ ఏడాది పరీక్షలు ముందుగా ప్రారంభం అయ్యాయి. మార్చి 18వ తేదీతో మొదలై ఏప్రిల్ 2వ తేదీ నాటికి పూర్తి అయ్యాయి. ఆ వెంటనే స్పాట్ మొదలైంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలను ఇలా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-result లింక్ పై క్లిక్ చేయాలి.

హోంపేజీలో కనిపించే https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024 లింక్ పై క్లిక్ చేయాలి.

మీ రూల్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ మార్కుల వివరాల కాపీని పొందవచ్చు.

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను ఈ లింకు ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/telangana-board-10th-result-2024

తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.cgg.gov.in లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. హోం పేజీలో కనిపించే TS SSC Results 2024 లింక్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. మీ పరీక్షా ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మార్కుల మెమోను పొందవచ్చు.

తదుపరి వ్యాసం