తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Diwali Crackers : క్రాకర్స్ తో జంతువులకు ఎంత ఇబ్బందో తెలుసా?

Diwali Crackers : క్రాకర్స్ తో జంతువులకు ఎంత ఇబ్బందో తెలుసా?

HT Telugu Desk HT Telugu

23 October 2022, 15:40 IST

    • Deepavali 2022 : దీపావళి వచ్చేసింది. చిన్నాపెద్దా పండగ సంబరాల్లోలో మునిగిపోయారు. కానీ క్రాకర్స్ కాల్చడమే దీపావళి అనేలా చేస్తారు కొంతమంది. అయితే ఇలా పెద్ద పెద్ద శబ్ధాలతో జంతువులకు చాలా ఇబ్బంది అవుతుంది.
శునకం
శునకం

శునకం

జంతువులపై పెద్దఎత్తున క్రాకర్స్(Crackers) ప్రభావం చూపుతాయని జంతు హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి(Deepavali) సందర్భంగా పెద్ద శబ్దాల నుండి వాటిని రక్షించాలని చెబుతున్నారు. పెంపుడు జంతువులు, ఇతర జంతువుల చెవులకు మెత్తటి కండువా కట్టాలని పశువైద్యులు సూచించారు. కనీసం పండుగ రోజు రాత్రి అయినా ఆశ్రయం కల్పించాలని చెబుతున్నారు. ఫైర్ క్రాకర్ల శబ్దం కారణంగా జంతువులు వాంతులు అవుతాయని పశువైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Plantix App: మూడు కోట్ల మంది రైతులు ఉపయోగిస్తున్న ప్లాంటిక్స్ యాప్… రైతుల మన్నన పొందుతున్న అప్లికేషన్

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

పటాకుల శబ్దం వల్ల జంతువులు, పక్షులు భయాందోళనకు గురవుతాయి. అందులో కొన్ని గాయాలకు గురవుతాయి. దీంతో తీవ్ర భయాందోళనకు లోనవుతాయి. .'క్రాకర్స్ పెద్ద శబ్దం జంతువులను భయపెడుతుంది. అవి దాక్కునేందుకు ప్రయత్నిస్తాయి. ఆశ్రయం కోసం పరిగెడుతున్నప్పుడు, వాహనాలు ఢీకొంటాయి.' అని వరంగల్ కు చెందిన ఓ పశువైద్యుడు తెలిపారు.

పక్షుల(Birds)కు సమీపంలో క్రాకర్లు పేల్చినప్పుడు అవి ఇబ్బందులు ఎదుర్కొంటాయని జంతు హక్కుల కార్యకర్తలు అంటున్నారు. కొన్నిసార్లు భయానికి కుప్పకూలిపోతాయన్నారు. కుక్కలు(Dogs) లాంటి జంతువులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాయని, కానీ గాయాల పాలవుతాయంటున్నారు. పక్షులు చనిపోతాయని.. పెద్ద పెద్ద శబ్దాలు చేసే క్రాకర్చ్ కాల్చవద్దని అంటున్నారు.

'కాలిన గాయాలు మాత్రమే కాదు. కుక్కలు, పిల్లులు మూర్ఛకు కారణమయ్యే పరిస్థితులు ఉంటాయి. తీవ్రమైన ఆందోళన చెందుతాయి. అలాంటి శబ్ధాల కారణంగా జంతువులకు ఇవి కొన్నిసార్లు జీవితాంతం ఉంటాయి.' అని పశువైద్యులు అంటున్నారు.

ప్రజలు చెట్ల దగ్గర క్రాకర్లు పేల్చుతారని ఈ కారణంగా పక్షులకు చనిపోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు. పక్షులు గాయపడతాయని ఆవేదన చెందుతున్నారు. కుక్కలు, పిల్లులు గాయపడతాయి. కుక్కలు భయపడినప్పుడు పరిగెత్తుతాయని, సురక్షితమైన స్థలాన్ని వెతుక్కుంటాయని చెబుతున్నారు. అయితే మిగతా జంతువులు అక్కడే పడిపోయే ప్రమాదం ఉందని.. క్రాకర్స్ తో నోరులేని జీవాలకు ఇబ్బందులకు గురిచేయద్దని జంతు ప్రేమికులు కోరుతున్నారు.