తెలుగు న్యూస్ / ఫోటో /
Diwali Decoration Ideas | అసలైన దీపావళి అలంకరణ అంటే ఇలా ఉండాలి!
- Diwali Decoration Ideas: దీపావళి పండగ రానే వచ్చింది, ఈ పండగ సమయంలోనే అందరి ఇండ్లు దీపాల వెలుతురులతో కాంతిలీనుతూ ఉంటాయి. మరి మీరు మీ ఇంటిని ఎలా అలంకరిస్తున్నారు? ఈ అలంకరణ చూడటానికి బాగుండడమే కాకుండా పండగ స్ఫూర్తిని, భక్తి భావాన్ని స్ఫురింపజేయాలి. అలా మీ ఇంటిని అలంకరించుకునేందుకు చిట్కాలు ఇవిగో..
- Diwali Decoration Ideas: దీపావళి పండగ రానే వచ్చింది, ఈ పండగ సమయంలోనే అందరి ఇండ్లు దీపాల వెలుతురులతో కాంతిలీనుతూ ఉంటాయి. మరి మీరు మీ ఇంటిని ఎలా అలంకరిస్తున్నారు? ఈ అలంకరణ చూడటానికి బాగుండడమే కాకుండా పండగ స్ఫూర్తిని, భక్తి భావాన్ని స్ఫురింపజేయాలి. అలా మీ ఇంటిని అలంకరించుకునేందుకు చిట్కాలు ఇవిగో..
(1 / 8)
దీపావళికి మీ ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలియకపోతే, చివరి నిమిషంలో మీకు ఉపయోగపడే కొన్ని డెకొరేషన్ ఐడియాలు అందిస్తున్నాం. ఇలా ట్రై చేసి చూడండి.
(2 / 8)
ఫ్లవర్ డెకరేషన్: ఏదైనా పండుగ లేదా ఈవెంట్‌కి అత్యంత సొగసైన అలంకరణలలో ఫ్లవర్ డెకరేషన్ ఒకటి. సాధారణంగా పూలు అంటే అందరికీ ఇష్టం. ఇంటి తలుపులు, కిటికీలను పూల మాలలతో అలంకరిస్తే ఇంటికి సహజసిద్ధమైన అందం వస్తుంది.
(3 / 8)
రంగు రంగుల దీపాలు: దీపావళి అంటేనే వెలుగుల పండుగ. కాబట్టి మీ ఇంటిని అందమైన దీపాలు, రంగురంగుల లైట్లతో అలంకరించండి. మట్టి దీపాలకు మీకు నచ్చిన రంగులతో పెయింట్ చేసి ఉంచితే, అవి మరింత ఆకర్షణగా ఉంటాయి.
(4 / 8)
రంగోలి: నూనె దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లు సానుకూల వైబ్‌లను సృష్టిస్తే, రంగోలిలు పండుగ స్ఫూర్తిని కలుగజేస్తాయి. గుమ్మం ముందు వివిధ రంగోలిలను గీసి, రంగులతో నింపండి, పువ్వులు, దీపాలతో అలంకరించండి.
(5 / 8)
వాల్ హ్యాంగింగ్స్: దీపావళి సందర్భంగా దేవతల చిత్రాలతో కూడిన వాల్ హ్యాంగింగ్‌లను మీ ఇంటి గోడలపై వేలాడదీయవచ్చు. ఐడల్ ప్రింటెడ్ వాల్ హ్యాంగింగ్స్ కూడా ఉపయోగించవచ్చు. ఇవి మీ దీపావళి అలంకరణలకు క్లాసిక్ టచ్‌ని అందిస్తాయి.
(6 / 8)
కళాకృతులు: మీరు చేతితో తయారు చేసిన కళాకృతులతో మీ ఇంటిని అలంకరించవచ్చు. లివింగ్ రూమ్, బాల్కనీ, ప్రధాన ద్వారం వద్ద, ఇంటి పైకప్పులను అలంకరించడానికి వాటిని ఉపయోగించవచ్చు. కళాకృతులు నీటిని నింపేలా ఉంటే.. అందులో నీటిని నింపి, పూల రేకులు చల్లి, మధ్యలో ఒక కొవ్వొత్తిని వెలిగించండి
(7 / 8)
ఫెయిరీ లైట్లు: మట్టి దీపాలతో పాటు, అద్భుతమైన రంగుల్లో కాంతులను వెదజల్లే ఫెయిరీ లైట్ల తోరణాన్ని కిటికీలకు, తలుపుకు వేలాడదీయండి, ఇంటి వెలుపల అలంకరించండి.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు