Deepavali Stories : దీపావళి గురించి ఆ నాలుగు కథలు మీకు తెలుసా?-deepavali special story on stories behind to celebrate deepavali in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Deepavali Special Story On Stories Behind To Celebrate Deepavali In Telugu

Deepavali Stories : దీపావళి గురించి ఆ నాలుగు కథలు మీకు తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 20, 2022 04:30 PM IST

Stories Behind Deepavali : దీపావళి అంటే బాగా గుర్తొచ్చేది శ్రీకృష్ణ, సత్యభామ.. నరకాసురుడిని వధించడమే. అయితే ఈ కథ కాకుండా మన పురణాలు మరో మూడు కథలను కూడా ఉన్నాయి. మరి ఆ కథలేమిటో.. వాటికి దీపావళికి సంబంధమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి కథలు
దీపావళి కథలు

Stories Behind Deepavali : హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగకు ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. మన పురాణాల ప్రకారం చీకటి నిరాశ నిస్పృహలకు, అజ్ఞానానికి గుర్తుగా భావిస్తారు. కాంతి (వెలుగు) ఆనందానికి ఉత్సాహానికి ప్రతీకగా చెప్తారు. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోనికి పయనించి.. జీవితములో కొత్త అర్ధాలు వెతుక్కోవాలని తెలిపే ఉద్దేశ్యమే దీపావళి అని ప్రముఖ ఆధాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

దీపం ఐశ్వర్యం అని.. అంధకారం దరిద్రం అని.. దీపమున్నచోట జ్ఞాన సంపద ఉంటుందని దీపము సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీపావళిరోజు లక్ష్మీ దేవికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే.. సకల సంపదలు కలుగుతాయని పురాణాలు తెలిపాయి. సనాతన ధర్మంలో ఏ శుభకార్యం జరిగినా దీపాన్ని వెలిగించడం అనేది ఒక సంప్రదాయం. దీపకాంతిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులగా చెప్తుంది శాస్త్రము.

దీపంలో కనిపించే ఎర్రని కాంతి బ్రహ్మదేవునిగా.. నీలకాంతి విష్ణు భగవానునిగా.. తెల్లని కాంతి పరమశివునికి ప్రతినిధులుగా చెపుతారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆశ్వయుజ మాసం అమావాస్య స్వాతి నక్షత్రము రోజును దీపావళిగా చెప్తారు. పురాణాల ప్రకారం దీపావళి అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం నాలుగు కథలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చుద్దాం.

శ్రీరామ చంద్రుడు.. సీతా దేవి

రావణాసురునితో జరిగిన యుద్ధంలో విజయము సాధించిన శ్రీరామచంద్రుడు.. సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆరోజు ఆశ్వయుజ మాసం, అమావాస్య అని రామాయణం చెప్తుంది. ఆరోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెప్తున్నాయి.

నరకాసురుని సంహరణ

నరకాసురుని సంహరించిన తరువాత.. నరకాసురుని పీడ వదిలిపోవడంతో ప్రజలంతా ఈ అమావాస్య రోజు దీపాలను వెలిగించి పండుగ జరుపుకున్నారు. ఆ పరంపర నేటికి జరుగుతున్నదని పురాణాలు చెప్తున్నాయి.

లక్ష్మీదేవి ఉద్భవించినరోజు..

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రమును చిలుకుతుండగా.. లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆరోజును దీపావళిగా చెప్తారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని.. దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు.

అజ్ఞాతవాసం తర్వాత

మహాభారతంలో కౌరవులు సాగించిన మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెప్తారు. అలా పాండవులు తిరిగివచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం