Festive Glow | మెరిసే చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి, ఈ దీపావళికి ప్రత్యేకంగా కనిపించండి!-use these simple tips to get natural glow on face and look special on diwali ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Use These Simple Tips To Get Natural Glow On Face And Look Special On Diwali

Festive Glow | మెరిసే చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి, ఈ దీపావళికి ప్రత్యేకంగా కనిపించండి!

Oct 19, 2022, 09:22 PM IST HT Telugu Desk
Oct 19, 2022, 09:22 PM , IST

  • పండుగల రోజు ప్రత్యేకంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో సహజమైన మెరుపును కోరుకుంటే.. పార్లర్‌కు వెళ్లకుండా, మేకప్ అనేది లేకుండా కొన్ని సింపుల్ హోం రెమెడీస్‌తో ముఖంలో మెరుపును తీసుకురావచ్చు.

చర్మ సమస్యలన్నింటిని నయం చేసి, సహజంగా చర్మం కాంతివంతంగా చేయటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు అందిస్తున్నాం.

(1 / 7)

నేచురల్ క్లెన్సర్- కొన్నిసార్లు చాలా కెమికల్స్‌తో కూడిన క్లెన్సర్‌ని ఉపయోగించడం వల్ల ముఖం మెరుపును కోల్పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటప్పుడు శనగపిండి, ముల్తానీ మట్టితో ముఖాన్ని కడుక్కోవచ్చు.

(2 / 7)

స్క్రబ్బింగ్ - సహజమైన మెరుపు కోసం చనిపోయిన చర్మంపై మృతకణలను తొలగించడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం వారానికి ఒకసారి తేలికపాటి స్క్రబ్బింగ్ చేయండి. దీంతో చర్మం శుభ్రంగా కనిపిస్తుంది.

(3 / 7)

సన్ బాత్- చర్మం ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. విటమిన్ డి కోసం సింపుల్ గా ప్రతిరోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలో కూర్చుంటే చాలు. అయితే ఈ సమయంలో చర్మానికి సన్‌స్క్రీన్ రాసుకోవడం మర్చిపోవద్దు.

(4 / 7)

హైడ్రేషన్- చర్మం హైడ్రేట్ గా లేనపుడు మీ చర్మం డల్ గా కనిపిస్తుంది. దీని కోసం, నీరు పుష్కలంగా త్రాగాలి అలాగే ముఖానికి మంచి మాయిశ్చరైజర్ రాయండి.

(5 / 7)

మేకప్ రిమూవల్- మీరు రాత్రి సమయంలో నిద్రించినప్పుడల్లా, ముఖం నుండి మేకప్ తొలగించి, ఆ తర్వాత నిద్రపోండి. రాత్రి సమయంలో చర్మం సహజంగా రిపేర్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మేకప్ ఉంటే ఆ ప్రక్రియకు అంతరాయం కలుగుతుంది.

(6 / 7)

అలోవెరా జెల్- శీతాకాలం, వేసవి కాలాల్లో ముఖానికి అలోవెరా జెల్ రాయటం ప్రయోజనకరంగా ఉంటుంది. రాత్రిపూట సీరమ్ లాగా అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుని నిద్రపోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు