Surya Grahanam 2022 | సూర్యగ్రహణం సమయంలో చేయాల్సినవి, గర్భిణీలు చేయకూడనివి ఇవే!-surya grahanam time dos and donts pregnant women precautions during solar eclipse 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Surya Grahanam 2022 | సూర్యగ్రహణం సమయంలో చేయాల్సినవి, గర్భిణీలు చేయకూడనివి ఇవే!

Surya Grahanam 2022 | సూర్యగ్రహణం సమయంలో చేయాల్సినవి, గర్భిణీలు చేయకూడనివి ఇవే!

HT Telugu Desk HT Telugu
Oct 23, 2022 12:26 PM IST

Surya Grahanam 2022: ఈ దీపావళి పండుగ సమయంలోనే అక్టోబర్ 25న సూర్యగ్రహణం (Solar Eclipse 2022) సంభవిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు, తదితర అంశాలను ఇక్కడ తెలుసుకోండి.

Solar Eclipse 2022
Solar Eclipse 2022 (HT Photo)

Solar Eclipse- Surya Grahanam 2022: ఈ వారంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం సంభవిస్తున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం తర్వాత సూర్యాస్తమయానికి ముందు గ్రహణం ప్రారంభమవుతుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. ఇది ఈ ఏడాదిలో సంభవిస్తున్న రెండవ, చివరి సూర్యగ్రహణం.

ఈ ఏడాది సూర్యగ్రహణం, వెలుగుల పండుగ దీపావళి రెండూ ఒకేసారి వచ్చాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత దీపావళి సందర్భంగా సూర్యగ్రహణం ఏర్పడుతోంది. 1995లో ఇలాగే ఒకసారి ఏర్పడింది, అయితే అప్పుడు దీపావళి పూర్తిగా ముగిశాక ఏర్పడింది.

సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుని కాంతి నేరుగా భూమిని చేరకుండా మధ్యలో చంద్రుడు అడ్డుగా ఉంటాడు. ఫలితంగా, చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. సూర్యుడు కూడా పూర్తిగా గుండ్రంగా కనిపించడు.

Solar Eclipse 2022 Time- సూర్య గ్రహణం సమయం

ఈ ఏడాది సూర్యగ్రహణము అక్టోబర్ 25, సాయంత్రం 5.01 ని.లకు ప్రారంభమయి, 6.26 ని.లకు పూర్తి అవుతుంది. గ్రహణ మధ్య కాలము సాయంత్రం గం. 5.29 ని.లు. గ్రహణ పుణ్యకాలము 1.25 ని.లు. సూర్య గ్రహణం దాదాపు గంటసేపు ఉంటుంది.

గ్రహణం పట్టిన సూర్యుడిని కంటితో చూడటం మంచిది కాదు. పాక్షిక గ్రహణం చూసినా అది జీవితాంతం కంటికి నష్టం, అంధత్వాన్ని కలిగిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి సైన్స్ పరంగా, పురాణ శాస్త్రాల పరంగా చేయవలసినవి, చేయకూడనివి ఇక్కడ తెలియజేస్తున్నాం.

సూర్య గ్రహణం సమయంలో చేయవలసినవి- Dos

హిందూ శాస్త్రాల ప్రకారం..

  • సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు శివుని మంత్రాలు జపించాలి.
  • సూర్యగ్రహణం ముగిసిన తర్వాత అందరూ తలస్నానం చేయాలి.
  • గ్రహణానంతరం గంగాజలం చల్లి ఇంటిని శుభ్రం చేయాలి.
  • గ్రహణ సమయంలో, గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండాలి.

సూర్యగ్రహణం సమయంలో చేయకూడనివి- Don'ts

ఈ సమయంలో వంట చేయడం, తినడం నిషేధం. మధ్యాహ్నం 3 తర్వాత ఆహారం మానుకోవాలి.

  • గ్రహణాన్ని కంటితో చూడకూడదు.
  • గ్రహణం సంభవించే సమయంలో ప్రజలు నిద్రపోకూడదు.
  • సూర్యగ్రహణానికి ముందు, ఆహారపదార్థాలపై తులసి ఆకులు, గరిక, నీరు ఉంచాలి.
  • పదునైన వస్తువులను ఉపయోగించడం చేయరాదు.

Pregnant Women Precautions- గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు:

  • గర్భిణీలు పూర్తిగా ఇంట్లోనే ఉండాలి.
  • గర్భిణీ స్త్రీ ఉండే గది తలుపులు, కిటికీలు తెరలతో కప్పాలి.
  • సూర్యగ్రహణం తర్వాత గర్భిణీ స్త్రీలు తప్పకుండా స్నానం చేయాలి.
  • గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులను ఉపయోగించకూడదు.
  • గ్రహణ సమయంలో గర్భిణీలు తినటం, తాగటం లాంటివి ఏమీ చేయకూడదు.

NASA సూచనలు

- సూర్యగ్రహణం సమయంలో ఆకాశం వైపు చూసే ముందు కంటి రక్షణగా సరైన అచ్ఛాదనను ధరించాలని NASA సిఫార్సు చేస్తుంది.

- సన్ గ్లాసెస్ ధరించి గ్రహణం చూడటం సురక్షితం కాదు. టెలిస్కోప్‌లు, సౌర వీక్షణ (solar viewing) లేదా ఎక్లిప్స్ గ్లాసెస్ (eclipse glasses) ఉపయోగించి చూడాలి.

- గ్రహణం సమయంలో హెడ్‌లైట్‌లను ఆన్ చేయండి.

- మొబైల్ కెమెరాతో సోలార్ సూర్యగ్రహణం చూడరాదు.

సూర్యగ్రహణం ప్రాంతాలను బట్టి 40-50 శాతం, మరికొన్ని చోట్ల 24 శాతం మాత్రమే కనిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం