Surya Grahanam 2022 । స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం.. గ్రహణ సమయం, ఫలితాలు, పరిహారాలు చూడండి!-surya grahanam 2022 know date time of october solar eclipse in india ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Surya Grahanam 2022, Know Date, Time Of October Solar Eclipse In India

Surya Grahanam 2022 । స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం.. గ్రహణ సమయం, ఫలితాలు, పరిహారాలు చూడండి!

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 11:30 AM IST

Surya Grahanam 2022: అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం (Solar Eclipse) సంభవిస్తుంది, అదే రోజున దీపావళి పండుగ ఉంది. ఈ సందర్భంగా పంచాగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ పలు పరిహారాలను వివరించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.

Surya Grahanam 2022- Solar Eclipse
Surya Grahanam 2022- Solar Eclipse (Pixabay)

Surya Grahanam 2022: ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన సూర్యగ్రహణం సంభవిస్తుంది. అదేరోజున దీపావళి పండగ రావడంతో అందరిలో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి, లక్ష్మీ పూజలకు శుభముహూర్తం ఎప్పుడు అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. అలాగే సూర్యగ్రహణ సమయము, గ్రహణం ఎప్పుడు వీడితుంది వంటి విషయాలపైనా చర్చించుకుంటున్నారు. వీటన్నింటికి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరణ ఇచ్చారు. అదేవిధంగా సూర్యగ్రహణం సమయంలో ఆచరించవలసిన నియమాలు, పరిహారాలు తెలిపారు. ఈ సూర్యగ్రహణం ఫలితంగా కొన్ని రాశుల వారికి ఫలితాలు మారనున్నాయి. ఆ విషయాలపైనా చిలకమర్తి చర్చించారు. అవన్నీ ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

సూర్యగ్రహణ సమయం

దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా చిలకమర్తి పంచాంగం దృష్ట్యా 25 అక్టోబర్ 2022 మంగళవారం ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రమునందు సూర్యగ్రహణము ఏర్పడినదని ప్రముఖ పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ సూర్యగ్రహణము సాయంత్రం 5.01 ని.లకు ప్రారంభమయి, 6.26 ని.లకు పూర్తి అవుతుంది. గ్రహణ మధ్య కాలము సాయంత్రం గం. 5.29 ని.లు. గ్రహణ పుణ్యకాలము 1.25 ని.లు.

ఈ గ్రహణము స్వాతి నక్షత్రము నందు సంభవించుట చేత తులారాశి వారు చూడకుండా ఉండటం మంచిది. ఈ గ్రహణము సాయంత్రం సంభవించుటచేత మధ్యాహ్నం 3 నుండి రాత్రి 10 వరకు ఆహార నియములు పాటించాలి. ఈ గ్రహణ ఫలము సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభఫలితాలు. కన్య, మేష, కుంభ, మిథున రాశులకు మధ్యస్త ఫలితాలు. తుల, కర్కాటక, మీన వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగజేయును.

సూర్యగ్రహణము సమయంలో తలస్నానము ఆచరించడం (పట్టు విడుపు స్నానాలు చేయడం), సూర్య ఆరాధన చేసుకోవడం. రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను కలుగచేస్తాయి. మోక్ష సాధకులకు సూర్యగ్రహణము సమయము నందు చేసేటువంటి ధ్యానమునకు విశేషములైనటువంటి ఫలితములుంటాయి. సూర్యగ్రహణము రోజే దీపావళి పండుగ సంభవించినది. సూర్యగ్రహణము సాయంత్రం 6.30 కు పరిసమాప్తం అయిన తరువాత 7 గంటల నుండి లక్ష్మీపూజ దీపారాధన, దీపావళి పండుగను యధావిధిగా జరుపుకొనవలెను అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel

సంబంధిత కథనం