తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

Mlc Kavitha Bail Petitions : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, బెయిల్ నిరాకరించిన కోర్టు

06 May 2024, 13:56 IST

    • Mlc Kavitha Bail Petitions : లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. కవితకు బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్
దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్ (ANI)

దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్

Mlc Kavitha Bail Petitions : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Mlc Kavitha)కు మళ్లీ నిరాశే ఎందురైంది. దిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ (Kavitha Bail)ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో కవితను ఈసీ అరెస్టు చేసింది. దిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor Policy)లో కవితపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవిత.. లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాలని బెయిల్ అభ్యర్థించారు. ఒక మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 45 ప్రకారం తనకు బెయిల్‌కు అర్హత ఉందని కోర్టు(Court)కు తెలిపారు. కవిత పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.... బెయిల్ తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

కవిత పిటిషన్లు తిరస్కరణ

ఈడీ(ED) కేసులో కవితకు(Mlc Kavitha) దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఆమె తిహార్ జైలులో ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్ల(Kavitha Bail Petitions)పై కోర్టులో వాదనలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కవితను అరెస్ట్‌ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ(CBI) అక్రమంగా అరెస్ట్‌ చేసిందని కోర్టుకు తెలిపారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ న్యాయవాదులు వాదించారు. కవిత ఈ కేసులో కీలకమైన వ్యక్తి అని...ఆమె సూత్రధారి కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించింది.

రేపటితో ముగియనున్న జ్యుడీషియల్ కస్టడీ

మే 7వ తేదీతో కవిత జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)ని ముగియనుంది. కవిత బెయిల్(Kavitha Bail) పిటిషన్లపై ఏప్రిల్ 23వ తేదీన వాదనలు విన్న దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగుస్తుండగా... ఇవాళ బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరి బవేజా తీర్పు ఇచ్చారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీ ముగిసే వరకూ ఆమె సీబీఐ, ఈడీ(CBI, ED) విచారణను ఎదుర్కొనాల్సి ఉంది. దిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసుల్లో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ, సీబీఐ అధికారులు అంటున్నారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని చెబుతున్నారు.

ఈ కేసులో అరెస్టైన దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు గత నెల 4వ తేదీన బెయిల్ లభించింది.

తదుపరి వ్యాసం