Mlc Kavitha Custody : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట, మరో 14 రోజులు జైలులోనే!-delhi liquor scam case rouse avenue court extended 14 days judicial custody to mlc kavitha ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Custody : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట, మరో 14 రోజులు జైలులోనే!

Mlc Kavitha Custody : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట, మరో 14 రోజులు జైలులోనే!

Bandaru Satyaprasad HT Telugu
Apr 23, 2024 03:54 PM IST

Mlc Kavitha Custody : దిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఊరట లభించలేదు. కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు కొనసాగుతున్నాయి.

దిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట
దిల్లీ లిక్కర్ కేసులో కవితకు దక్కని ఊరట

Mlc Kavitha Custody : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Mlc Kavitha)మరో షాక్ తగిలింది. దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఎమ్మె్ల్సీ కవితకు మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. తిరిగి మే 7న కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు. దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలతో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె తిహాడ్ జైలు(Tihar Jail)లో ఉన్నారు. దిల్లీ లిక్కర్ పాలసీపై కేసు నమోదు చేసిన సీబీఐ.. ఇటీవల కవితను కస్టడీలోకి తీసుకుని విచారించింది. దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌(Kavitha Bail Petition) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారించింది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదనలు వినిపించింది. కవిత అరెస్టు(Kavitha Arrest) చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ కోర్టుకు తెలిపింది.

బెయిల్ పిటిషన్లపై వాదనలు

దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)​ కేసులో బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha)కీలక సూత్రధారి అని సీబీఐ తెలిపింది. అయితే తమ విచారణలో ఆమె నిజాలు చెప్పడం లేదని సీబీఐ(CBI) కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఆమెకు బెయిల్​మంజూరు చేస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది. సోమవారం కవిత బెయిల్​పిటిషన్ పై వాదనలు జరిగాయి. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) స్టార్ క్యాంపెయినర్​గా ఉన్నానని, తనకు సీబీఐ కేసులో బెయిల్(Kavitha Bail) మంజూరు చేయాలని కవిత దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా సీబీఐ కవితను అరెస్టు చేసిందని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈసీ కస్టడీ ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని వాదించారు. ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని, బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని, ఆమెకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఈడీ (ED)కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్​ పిటిషన్​ పైనా కూడా రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగాయి.

Whats_app_banner

సంబంధిత కథనం