Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత-hyderabad brs mlc kavitha withdraw petition in supreme court challenge ed summons ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లు, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసుకున్న కవిత

Bandaru Satyaprasad HT Telugu
Mar 19, 2024 04:52 PM IST

Kavitha Petition : లిక్కర్ స్కామ్ లో ఈడీ సమన్లపై గతంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా కవిత ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు.

సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసకున్న కవిత
సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వెనక్కి తీసకున్న కవిత

Kavitha Petition : దిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను(Mlc Kavitha Arrest) ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు వారం రోజులు రిమాండ్ విధించింది. అయితే కోర్టులో తన పిటిషన్ విచారణలో ఉండగా ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని కవిత... సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఈడీ సమన్లపై(ED Summons) కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను కవిత ఇవాళ విత్ డ్రా చేసుకున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కవితను అరెస్టు చేయడంతో.. రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వెల్లడించారు. పిటిషన్‌ ఉపసంహరణకు(Writ Petition) జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన బెంచ్ అనుమతించింది. ఈడీ సమన్లపై గత ఏడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో(Supreme Court) రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా తన అరెస్టు అక్రమమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

కవితదే కీలక పాత్ర

దిల్లీ లిక్కర్ పాలసీ (Delhi Liquor Case)రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ అధికారులు(ED Raids) సోదాలు నిర్వహించారు. అనంతరం కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే (Mlc Kavitha)కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.

ఈడీ ప్రకటన

మార్చి 15న హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు(Raids) నిర్వహించారు. ఆ సమయంలో ఈడీ అధికారులను కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని ఈడీ ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొందరు కలిసి దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కు ప్లాన్ చేశారని ఈడీ విచారణలో తేలిందని వెల్లడించింది. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), ఆప్ నేత మనీష్ సిసోడియా ఎక్సైజ్ పాలసీ(Delhi Excise Policy) రూపకల్పన, అమలులో అవకతవలకు పాల్పడ్డారని తన విచారణలో తెలిసిందని చెప్పింది. ఈ కుట్రలో కవిత పాత్ర కూడా ఉందని ఈడీ తెలిపింది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ రూపొందించేందుకు కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించారని ఈడీ అభియోగించింది. అవినీతికి పాల్పడే ఉద్దేశంతోనే దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపొందించారని, అక్రమ మార్గంలో ఆప్ నేతలకు నిధులు అందాయని తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం