తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ind Aus Match Hyd: ఫ్యాన్స్​కు పోలీస్ అలర్ట్… స్టేడియంలోకి ఈ వస్తువులు తేవొద్దు

Ind Aus Match Hyd: ఫ్యాన్స్​కు పోలీస్ అలర్ట్… స్టేడియంలోకి ఈ వస్తువులు తేవొద్దు

HT Telugu Desk HT Telugu

24 September 2022, 17:29 IST

    • traffic restrictions in hyderabad: హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న ఇండియా–ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న టీ–20 మ్యాచ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓ వైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. స్టేడియంలోకి ఏఏ వస్తువులు తీసుకురావొద్దనే దానిపై కీలక ప్రకటన చేశారు.
ఆదివారం భారత్ - ఆసీస్ మధ్య క్రికెట్ మ్యాచ్
ఆదివారం భారత్ - ఆసీస్ మధ్య క్రికెట్ మ్యాచ్ (HT)

ఆదివారం భారత్ - ఆసీస్ మధ్య క్రికెట్ మ్యాచ్

India vs Australia Cricket Match at Hyderabad: రేపు భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ సందర్భంగా నగర పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. ప్రజలు ఇబ్బందిపడకుండా.... ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవసరం ఉంటే తప్ప బయటకు అడుగు వేయొద్దని స్పష్టం చేశారు. స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Srilanka Tour Package : హైదరాబాద్ నుంచి శ్రీలంక రామాయణ యాత్ర- 5 రోజుల ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Mysore Ooty Tour : మైసూర్ టూర్ ప్లాన్ ఉందా..? బడ్డెట్ ధరలోనే ఊటీతో పాటు ఈ ప్రాంతాలను చూడొచ్చు, ఇదిగో ప్యాకేజీ

Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

ఆదివారం జరిగే మ్యాచ్ కు దాదాపుగా 40 వేలకు పైగా క్రీడాభిమానులు మ్యాచ్‌ వీక్షించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో ఉప్పల్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు స్డేడియంలో ఎలాంటి వస్తువులు తీసుకురావాలనే అనే దానిపై పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

prohibited items inside the uppal stadium: వీటికి నో ఎంట్రీ....

హెల్మెట్, కెమెరాలు, ల్యాప్‌ట్యాప్‌లు, సిగరెట్లు, తినుబండారాలు తీసుకురావొద్దు.

ఆల్కహాల్ / మత్తు పదార్థాలు, సెల్ఫీ స్టిక్స్, హాల్‌పిన్స్,బైనాక్యులర్స్, ఆయుధాలు, బ్లేడ్లు, చాకులు, మంచి నీటి బాటిల్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు.

మ్యాచ్‌ టికెట్లను బ్లాక్‌ దందా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

జీహెచ్‌ఎంసీ తరపున ప్రత్యేకంగా మొబైల్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు....

traffic restrictions in hyderabad: ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భారీ వాహనాలను అనుమతించబోరు. సికింద్రాబాద్ నుంచి ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను కూడా అనుమతించరు. స్టేడియం నలువైపులా ఐదు క్రైన్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్‌ నేపథ్యంలో 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. గేట్ నెంబర్1 ద్వారా వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 కార్లు పట్టేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి ఉండదు.

తార్నాక మీదుగా వచ్చే వీఐపీ వాహనాలు హబ్సీగూడ, ఎన్జీఆర్ఐ, ఏక్ మినార్ వద్ద కుడి వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకొని వాహనాలను ఏ, సీ ల వద్ద నిలపాల్సి ఉంటుంది. అంబర్ పేట్ వైపు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు దూరదర్శన్, రామాంతపూర్, స్ట్రీట్ నెంబర్ 8 వద్ద ఎడమ వైపునకు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్ద దిగి వాహనాలను పార్కింగ్ ఏ, సీ ల వద్ద పార్క్ చేయాలి.

నాగోల్, వరంగల్ హైవే నుంచి వచ్చే వీఐపీ వాహనాలు ఉప్పల్ చౌరస్తా, సర్వే ఆఫ్ ఇండియా, ఏక్ మినార్ వద్ద ఎడమ వైపు తీసుకొని గేట్ నెంబర్ 1 వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని సాధారణ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని... వీలైనంత త్వరగా ఆంక్షలు ఎత్తివేస్తామని పోలీసులు చెబుతున్నారు.