Traffic advisory hyd: రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు… అటువైపు వెళ్లొద్దు
16 September 2022, 17:25 IST
- traffic restrictions in hyderabad city: తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions in Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు నగర పోలీసులు రూట్ మ్యాప్ విడుదల చేశారు. తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా ఈ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు.రేపు(సెప్టెంబర్ 17వ తేదీ) ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరుగనుంది. 33 జిల్లాల నుండి 2300 బస్సులలో 1 లక్ష మంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది.
telangana national integration day event in hyd:రేపు ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం వద్ద కళాకారుల ప్రదర్శనలు, పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్. ఎన్టీఆర్ స్టేడియంలో సీఎం కేసీఆర్ సభకు 1లక్ష మందితో మీటింగ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 2300 బస్సులో 1 లక్షకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సెంట్రల్ జోన్‌తో పాటు పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరా పార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర పూర్తిగా స్థాయి ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కవాడి గూడ, అశోక్ నగర్, ముషీరాబాద్, ఇందిరా పార్కు, లిబర్టీ, నారాయణ గూడ, రాణిగంజ్, నెక్ లెస్ రోడ్, పలు ఏరియా జంక్షన్‌లలో ట్రాఫిక్ పూర్తిగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. వీటిని ప్రయాణికులు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు.
సెంట్రల్ జోన్‌లో ప్రధానంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం జరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. వాహన దారులు గ్రహించి ఈ ఏరియాను డైవర్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. నెక్లెస్ రోడ్ , పబ్లిక్ గార్డెన్స్, నిజాం కాలేజ్‌లో జిల్లాల నుండి వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
నెక్లెస్ రోడ్డు ఇరువైపులా పూర్తిగా రాకపోకలను నిషేధించారు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే రోడ్డును మూసివేయనున్నారు.
కట్ట మైసమ్మ ఆలయం నుంచి అంబేడ్కర్ స్టాచ్యూ వైపు ఆంక్షలు ఉంటాయి.
రాణిగంజ్, నెక్‌లేస్‌రోడ్ కూడళ్ల వైపు వెళ్లే వాహనాలను సైతం దారి మళ్లిస్తారు.
కవాడిగూడ, అశోక్‌నగర్, ముషీరాబాద్ కూడళ్ల నుంచి ట్రాఫిక్ మళ్లిస్తారు.