IND Vs AUS Tickets : భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్ ఆన్‌లైన్‌లో ఎప్పుడంటే?-india vs australia t20i match online tickets released here is how to download ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  India Vs Australia T20i Match Online Tickets Released Here Is How To Download

IND Vs AUS Tickets : భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్ ఆన్‌లైన్‌లో ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Sep 22, 2022 05:39 PM IST

India Vs Australia t20i Match Online Tickets : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల రాత్రి 7 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్
భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్

గురువారం రాత్రి 7 తర్వాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆన్‌లైన్‌ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జింఖానా మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించిన ఆఫ్‌లైన్‌ టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. 25వ తేదీన భారత్‌ ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్‌ చూసేందుకు టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు భారీగా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

రెండేళ్ల విరామం తర్వాత, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 20 నుంచి భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 25న (ఆదివారం) హైదరాబాద్‌లో జరగనుంది.

దాదాపు 4 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో టీ 20 క్రికెట్ ఆడేందుకు టీమ్ ఇండియా రెడీ అయ్యింది. డిసెంబరు 6, 2019న వెస్టిండీస్‌తో చివరిగా ఆడిన T20 మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడించింది భారత్. కేఎల్ రాహుల్ 62, విరాట్ కోహ్లీ 94 పరుగుల ఆధిక్యంతో భారత్ 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోరును ఛేదించింది. ఈసారి సెప్టెంబరు 25న జరిగే మూడో టీ20లో ఆస్ట్రేలియాతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తలపడనుంది.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం 55,000 మంది సామర్థ్యంతో నగరంలోని ప్రధాన క్రికెట్ స్టేడియం. ఇది అత్యాధునిక సదుపాయాలతో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్‌లతో పాటు అనేక అంతర్జాతీయ ఆటలు ఇక్కడ జరిగాయి. ఇప్పుడు టీమ్ ఇండియా-ఆస్ట్రేలియా టీ 20 కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

టీమ్ ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షాల్ , జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్

IPL_Entry_Point