Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఇదే - ఆ సెంటిమెంట్ క‌లిసివ‌స్తుందా-bcci unveils new t20i jersey for team india cricketers
Telugu News  /  Sports  /  Bcci Unveils New T20i Jersey For Team India Cricketers
హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, సూర్యకుమార్ యాదవ్
హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, సూర్యకుమార్ యాదవ్ (twitter/bcci)

Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఇదే - ఆ సెంటిమెంట్ క‌లిసివ‌స్తుందా

19 September 2022, 8:12 ISTHT Telugu Desk
19 September 2022, 8:12 IST

Team India New Jersey: టీమ్ ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ అదివారం విడుదలచేసింది. స్కై బ్లూ కలర్ జెర్సీలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తో పాటు మిగిలిన క్రికెటర్లు కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Team India New Jersey: ఇకపై టీ20 మ్యాచ్ లలో టీమ్ ఇండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీలో క‌నిపించ‌నున్నారు. టీమ్ ఇండియా కొత్త జెర్సీని బీసీసీఐ ఆదివారం రిలీజ్ చేసింది. స్కై బ్లూ కలర్ లో డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ జెర్సీని రోహిత్, శర్మ, హార్ధిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ తో ఉమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ ధరించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ నెల 20న ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరుగనున్న టీ20 మ్యాచ్ ద్వారా కొత్త జెర్సీలో టీమ్ ఇండియా ఆటగాళ్లు కనిపిస్తారు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ లతో పాటు టీ20 వరల్డ్ కప్ లో ఇదే జెర్సీ ధరించబోతున్నారు.

2007 వరల్డ్ కప్ లో స్కై బ్లూ కలర్ జెర్సీ ధరించి టీమ్ ఇండియా ఆటగాళ్లు కనిపించారు. అదే ఏడాది ధోనీ సారథ్యంలోని యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ ఇండియా టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకున్నది. మరోసారి అదే కలర్ జెర్సీ ధరించి టీ20 వరల్డ్ కప్ లో బరిలో దిగబోతున్నది టీమ్ ఇండియా. కలర్ సెంటిమెంట్ మరోసారి కలిసి వస్తుందని క్రికెట్ అభిమానులు పేర్కొన్నాడు

. గత ఏడాది అక్టోబర్ లోనే టీమ్ ఇండియా జెర్సీ కలర్ లో బీసీసీఐ మార్పులు చేసింది. ఏడాది ముగియకముందే మరోసారి మార్చడం ఆసక్తికరంగా మారింది.