తెలుగు న్యూస్  /  Sports  /  World Cup 2023 Icc Has Got No Written Assurance On Pakistan's Participation In Odi World Cup

World Cup 2023 : వన్డే వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ దూరం.. ఇంకా ఇవ్వని క్లారిటీ!

Anand Sai HT Telugu

11 May 2023, 12:24 IST

    • World Cup 2023 : ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు పాల్గొనడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మెగా టోర్నీలో దాయాదీ దేశం పాల్గొనడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
వన్డే వరల్డ్ కప్
వన్డే వరల్డ్ కప్

వన్డే వరల్డ్ కప్

వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో పాకిస్థాన్ జట్టు పాల్గొంటుందో లేదో తెలియాలి. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. పీసీబీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మెగా టోర్నీ ఆడే విషయంపై పీసీబీ(PCB) ఇబ్బటి వరకూ ఎలాంటి లిఖితపూర్వక కమిట్ మెంట్ ఇవ్వలేదని ఐసీసీ అదికారి ఒకరు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

'టీమిండియా.. పాకిస్థాన్ వెళ్లడం, పాకిస్థాన్ టీమ్ భారత్ రావడం అనేది పీసీబీ, బీసీసీఐలపై ఆధారపడి ఉంటుంది. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనే విషయంపై పీసీబీ ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బీసీసీఐ తరహాలోనే ఆ జట్టు పాల్గొనడంపై పాక్ ప్రభుత్వం అనుమతివ్వాల్సి ఉంది. ఆ దేశ ప్రభుత్వ అనుమతికి లోబడి మాత్రమే పీసీబీ నిర్ణయం తీసుకోవాలి.' అని ఆ అధికారి తెలిపారు

ఈ మెగాటోర్నికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ(BCCI) ఇప్పటికే పూర్తి చేసింది. ఐపీఎల్ 2023 సీజన్ ముగిసిన వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. మెగా టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ లు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో జరగనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్(Hyderabad) వేదికగా ప్లాన్ చేశారు. ఆహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆడేందుకు పీసీబీ ఆసక్తిగా లేనట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇంకోవైపు.. ఆసియా కప్ 2023(Asia Cup 2023) నిర్వహణపై స్పష్టతలేదు. ఏసీసీ షెడ్యూల్ ప్రకారం.. ఈ టోర్నీ పాకిస్థాన్(Pakistan) వేదికగా జరగాలి. కానీ భద్రతా కారణాలు, ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ వెళ్లేందుకు భారత్ ఒప్పుకోవడం లేదు. దీంతో పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. భారత్ ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికగా దుబాయ్(Dubai)లో నిర్వహిస్తామని వెల్లడించింది. మిగతా మ్యాచ్ లను పాక్ వేదికగా జరుపుతామని తెలిపింది. ఈ ప్రతిపాదనను శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు వ్యతిరేకిస్తున్నాయి.

దీంతో ఆసియాకప్ 2023 శ్రీలంకకు తరలించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తు్న్నాయి. అదే జరిగితే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని పీసీబీ అనుకుంటోంది. ఈ గొడవల నేపథ్యంలో ఆసియా కప్ 2023ని రద్దు చేసి.. మల్టీ నేషనల్ టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ఆలోచనల్లో ఉంది. ఆసియా కప్ నిర్వహణపై క్లారిటీ వచ్చిన తర్వాతే.. వన్డే ప్రపంచకప్ ఆడటంపై పీసీబీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.