తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Twitter Followers: ట్విటర్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి

Virat Kohli Twitter Followers: ట్విటర్‌లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి

Hari Prasad S HT Telugu

13 September 2022, 14:39 IST

    • Virat Kohli Twitter Followers: ట్విటర్‌లో అరుదైన ఘనత సాధించాడు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్న అతడు.. ఇప్పుడీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు.
విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (AP)

విరాట్ కోహ్లి

Virat Kohli Twitter Followers: క్రికెట్‌ ఫీల్డ్‌లో విరాట్‌ కోహ్లి రికార్డులకు లెక్కే లేదు. చాలా కాలంగా ఫామ్‌ కోల్పోయి తంటాలు పడిన కోహ్లి.. ఈ మధ్యే ఆసియాకప్‌తో తిరిగి ఫామ్‌ కూడా అందుకున్నాడు. సుమారు మూడేళ్ల తర్వాత సెంచరీ ముచ్చటా తీర్చుకున్నాడు. ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో రికార్డుల పని పడుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 21.1 కోట్ల మంది ఫాలోవర్లతో ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా ఇప్పటికే కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇక ఇప్పుడు ట్విటర్‌లోనూ అదే ఘనత అందుకున్నాడు. ఈ సోషల్‌ మీడియాలో 5 కోట్ల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్‌ నిలిచాడు. అటు ఫేస్‌బుక్‌లో విరాట్‌కు 4.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ లెక్కన మూడు ప్రధాన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ కలిసి విరాట్‌ కోహ్లి మొత్తం ఫాలోవర్ల సంఖ్య 31 కోట్లు కావడం విశేషం.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రికెటర్‌గా రికార్డు ఉన్న విరాట్‌ కోహ్లి.. ఓవరాల్‌గా స్పోర్ట్స్‌ స్టార్స్‌లో క్రిస్టియానో రొనాల్డో (45 కోట్లు), లియోనెల్‌ మెస్సీ (33.3 కోట్లు) తర్వాత మూడోస్థానంలో ఉన్నాడు. ట్విటర్‌లోనూ ఈ మధ్యే 5 కోట్ల మంది ఫాలోవర్లను విరాట్‌ సొంతం చేసుకున్నాడు. సుమారు మూడేళ్లుగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెంచరీ చేయకపోయినా, మధ్యలో టీమిండియా కెప్టెన్సీ కోల్పోయినా, ఈ ఏడాది చాలా వరకూ బ్యాటింగ్‌లో విఫలమైనా.. సోషల్‌ మీడియాలో కోహ్లి చరిష్మా ఏమాత్రం తగ్గలేదు.

ఇక ఇప్పుడు ఆసియా కప్‌తో తిరిగి గాడిలో పడ్డాడు. ఒక సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలతో టోర్నీ అత్యధిక రన్స్‌ చేసిన ఇండియన్‌ ప్లేయర్‌, ఓవరాల్‌గా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 1019 రోజుల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో 71వ సెంచరీ కూడా చేశాడు. వచ్చే నెలలో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న నేపథ్యంలో కోహ్లి ఫామ్‌లోకి రావడం టీమిండియా బలాన్ని అమాంతం పెంచేసింది.

<p>ట్విటర్ లో 5 కోట్ల ఫాలోవర్లను అందుకున్న విరాట్ కోహ్లి&nbsp;</p>