Virat Kohli Instagram Story: ఇంట్రెస్టింగ్‌గా విరాట్ ఇన్‌స్టా స్టోరీ.. ఎవరి గురించో మరి!
Virat Kohli Instagram Story: విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న సమయంలో తనకు ధోనీ మాత్రమే మెసేజ్ చేశాడని అతడు అనడం.. దీనికి గవాస్కర్ కౌంటర్ వేసిన నేపథ్యంలో ఈ పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
Virat Kohli Instagram Story: విరాట్ కోహ్లి చాలా రోజులుగా ఫామ్‌లో లేక వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఆసియా కప్‌లో ఫామ్‌లోకి వచ్చి రెండు వరుస హాఫ్ సెంచరీలు చేసి కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత అతడు చేసిన కామెంట్స్ మాత్రం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాను టెస్ట్ కెప్టెన్సీ వదులుకున్న సమయంలో ధోనీ మాత్రమే తనకు మెసేజ్ చేశాడని విరాట్ అన్నాడు.
అయితే అతని కామెంట్స్‌పై మాజీ కెప్టెన్ గవాస్కర్ మండిపడ్డాడు. అసలు తనకు ఏమని మెసేజ్ చేయాలట.. అతనికి ఎవరు మెసేజ్ చేయలేదో వాళ్ల పేర్లు కూడా చెప్పాల్సింది.. ఆసియాకప్ జరుగుతున్న సమయంలో ఇలాంటి కామెంట్స్ చేయడమేంటని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంతో మంగళవారం (సెప్టెంబర్ 6) విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది.
ఈ పోస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మన చుట్టూ ఎలాంటి మనుషులు ఉండాలో తెలుసుకోవాలంటూ జీవిత పాఠాలు చెప్పడం విశేషం. "మీ సంతోషాన్ని తమ సంతోషంగా భావించే, మీ బాధను తమ బాధగా చూసే వ్యక్తులను గుర్తించండి. అలాంటి వాళ్లకే మీ మనసులో ప్రత్యేక స్థానం ఇవ్వండి" అని విరాట్ కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో రాశాడు.
అయితే ఈ క్రిప్టిక్ పోస్ట్ అతను ఎవరి గురించి చేశాడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా తాను చేసిన కామెంట్స్.. దీనిపై సన్నీ రియాక్షన్ నేపథ్యంలో ఈ స్టోరీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక కోహ్లి ఆట విషయానికి వస్తే.. ఆసియా కప్‌లో మెల్లగా మునుపటి విరాట్‌ను ప్రేక్షకులు చూస్తున్నారు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో అతడు చెలరేగాడు.
హాంకాంగ్, పాకిస్థాన్‌లపై హాఫ్ సెంచరీలు చేసిన విరాట్.. కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఇండియా ఓడిపోయినా.. ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌లు, వరల్డ్‌కప్ రానున్న నేపథ్యంలో కోహ్లి మళ్లీ ఫామ్‌లోకి రావడం ఊరట కలిగించే విషయం.