తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sourav Ganguly Declines Ipl Chairmanship: ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి వద్దన్న గంగూలీ

Sourav Ganguly declines IPL chairmanship: ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి వద్దన్న గంగూలీ

Hari Prasad S HT Telugu

11 October 2022, 19:32 IST

    • Sourav Ganguly declines IPL chairmanship: ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఆఫర్‌ను సౌరవ్‌ గంగూలీ తిరస్కరించారు. బీసీసీఐ అధ్యక్షుడిగానే కొనసాగాలని అనుకున్న ఆయనకు ఆ అవకాశం దక్కలేదు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Hindustan Times)

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

Sourav Ganguly declines IPL chairmanship: బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కూడా పని చేయాలన్న సౌరవ్‌ గంగూలీ ఆశ నెరవేరలేదు. ఆయన రెండోసారి పోటీ చేయడానికి బోర్డులోని ఇతర సభ్యులు అంగీకరించలేదు. దీంతో అధ్యక్ష పదవి నుంచి గంగూలీ తప్పుకోవాల్సి వస్తోంది. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్‌, 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మెంబర్‌ అయిన రోజర్‌ బిన్నీ అధ్యక్షుడు కానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అధ్యక్ష పదవితోపాటు ఇతర అన్ని పదవులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఏ పదవికి కూడా ఎన్నికలు జరగడం లేదు. అక్టోబర్‌ 18న జరగబోయే బీసీసీఐ ఏజీఎంలో రోజర్‌ బిన్నీని అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు. ఈ పదవిలో కొనసాగేందుకు సౌరవ్‌ గంగూలీ చాలా ప్రయత్నాలే చేశారు. కొన్ని రోజులుగా బీసీసీఐలోని సభ్యులతో సమావేశాలు జరుపుతున్నారు.

ఢిల్లీలో వరుస మీటింగ్‌ల తర్వాత సోమవారం ముంబై తిరిగి వచ్చారు. అయితే ఈ సమావేశాల్లో గంగూలీకి చుక్కెదురైంది. రెండోసారి బోర్డు అధ్యక్షుడిగా ఒకే వ్యక్తిని ఎన్నుకునే సాంప్రదాయం లేదని సభ్యులంతా తేల్చి చెప్పారు. అయితే ఐపీఎల్ ఛైర్మన్‌ పదవి నుంచి బ్రిజేష్‌ పటేల్‌ తప్పుకోనుండటంతో ఆ పదవి తీసుకోవాల్సిందిగా గంగూలీకి ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

కానీ ఓ సబ్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉండటం ఇష్టం లేని దాదా.. తిరస్కరించారు. "సౌరవ్‌ గంగూలీకి ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవి ఆఫర్‌ ఇచ్చారు. అయితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. బీసీసీఐకి హెడ్‌గా చేసిన తర్వాత అందులోని సబ్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉండకూడదని ఆయన నిర్ణయించారు. బీసీసీఐ అధ్యక్ష పదవిలోనే కొనసాగాలని అనుకున్నారు" అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐతో చెప్పారు.

ఐపీఎల్ ఛైర్మన్‌ పదవిని గంగూలీ తిరస్కరించడంతో ఇప్పటి వరకూ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న అరుణ్‌ ధుమాల్‌కు ఆ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. గంగూలీని ఐసీసీ ఛైర్మన్‌ పదవికి బీసీసీఐ తరఫున నామినేట్‌ చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే అది కూడా ఎంత వరకూ సాధ్యమన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై కూడా బీసీసీఐ ఏజీఎంలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

టాపిక్