తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sehwag On Pant: నాలాగా ఆడే మరో ప్లేయర్ లేడు.. నాకూ, పంత్‌కు అదే తేడా: సెహ్వాగ్

Sehwag on Pant: నాలాగా ఆడే మరో ప్లేయర్ లేడు.. నాకూ, పంత్‌కు అదే తేడా: సెహ్వాగ్

Hari Prasad S HT Telugu

20 March 2023, 17:25 IST

  • Sehwag on Pant: నాలాగా ఆడే మరో ప్లేయర్ లేడు.. నాకూ, పంత్‌కు అదే తేడా అంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పంత్, పృథ్వీ షాలాంటి వాళ్లను సెహ్వాగ్ తో పోల్చినా.. వీరూ వాదన మాత్రం మరోలా ఉంది.

వీరేంద్ర సెహ్వాగ్
వీరేంద్ర సెహ్వాగ్ (In-house)

వీరేంద్ర సెహ్వాగ్

Sehwag on Pant: ఇండియన్ క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ చాలా ప్రత్యేకమైన ప్లేయర్. అతనిలాంటి ప్లేయర్ ముందుగానీ, తర్వాతగానీ రాలేదు. ఎలాంటి ఫుట్‌వర్క్ ఉండదన్న విమర్శలు ఉన్నా.. కేవలం హ్యాండ్, ఐ కోఆర్డినేషన్ తో బౌండరీలు బాదడం వీరూ స్టైల్. టెస్ట్ క్రికెట్ ను కూడా టీ20 స్టైల్లో ఆడిన ప్లేయర్ అతడు. ఇప్పుడు ఇంగ్లండ్ చెబుతున్న బజ్‌బాల్ రుచి ప్రత్యర్థులకు ఎప్పుడో చూపించిన ప్లేయర్.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇప్పుడు కూడా ఎవరైనా టెస్టుల్లో కాస్త ధాటిగా ఆడుతున్నారంటే సెహ్వాగ్ తోనే పోలుస్తుంటారు. అలా ఇండియన్ క్రికెట్ లో రిషబ్ పంత్, పృథ్వీ షాలాంటి వాళ్లను సెహ్వాగ్ తో పోలుస్తుంటారు. కానీ వీరూ వాదన మాత్రం మరోలా ఉంది. తనలాగా ఆడే మరో ఇండియన్ ప్లేయర్ లేడని, పంత్ కూ, తనకు మధ్య ఉన్న తేడాను కూడా సెహ్వాగ్ వివరించాడు.

న్యూస్ 18 ఛానెల్ తో మాట్లాడిన వీరూ.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "ఇండియన్ టీమ్ లో నాలాగా బ్యాటింగ్ చేసే మరో ప్లేయర్ లేడని అనుకుంటున్నా. నాలాగా ఆడే ప్లేయర్స్ అంటే నాకు గుర్తొచ్చే ఇద్దరు ప్లేయర్స్ పృథ్వీ షా, రిషబ్ పంత్. టెస్ట్ క్రికెట్ లో పంత్ దాదాపు నాలాగే బ్యాటింగ్ చేస్తున్నాడు.

అయితే అతడు 90-100 స్కోర్లతోనే సంతృప్తి చెందుతున్నాడు. నేను మాత్రం 200, 250, 300 స్కోర్లు చేశాను. పంత్ ఆ స్థాయికి తన ఆటను తీసుకెళ్లినప్పుడు అభిమానులను మరింత అలరించగలడు" అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

టెస్ట్ క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్ ప్లేయర్ గా సెహ్వాగ్ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అతని తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ ఘనత అందుకున్న మరో ఇండియన్ ప్లేయర్ కరుణ్ నాయర్ మాత్రమే. అంతేకాదు టెస్టుల్లో సున్నాపై ఉన్నా.. 99పై ఉన్నా సెహ్వాగ్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండేది కాదు. దీని వెనుక కారణమేంటో కూడా వీరూ చెప్పాడు.

"నేను టెన్నిస్ బాల్ తో ఆడేవాడిని. దాంతో చాలా వరకూ పరుగులను బౌండరీల రూపంలోనే సాధించాలని అనుకునేవాడిని. అంతర్జాతీయ క్రికెట్ లోనూ అలాగే ఆడాను. ఓ సెంచరీ చేయడానికి ఎన్ని బౌండరీలు అవసరమో లెక్కేసేవాడిని. నేను 90ల్లో ఉండి సెంచరీ చేయడానికి మరో 10 బంతులు తీసుకుంటే.. ప్రత్యర్థులకు నన్ను ఔట్ చేయడానికి పది బంతులు దొరుకుతాయి.

అలా కాకుండా త్వరగా సెంచరీ చేయాలన్న ఉద్దేశంతో బౌండరీలు బాదుతూ.. వాళ్లకు రెండు బంతుల కంటే ఎక్కువ అవకాశం ఇచ్చే వాడిని కాదు. దీని వల్ల రిస్క్ శాతం 100 నుంచి 200 శాతం తగ్గుతుంది" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.