తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Risabh Pant Walking: స్విమ్మింగ్ పూల్‌లో నడిచిన రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్న వికెట్ కీపర్

Risabh Pant Walking: స్విమ్మింగ్ పూల్‌లో నడిచిన రిషబ్ పంత్.. వేగంగా కోలుకుంటున్న వికెట్ కీపర్

Hari Prasad S HT Telugu

15 March 2023, 17:14 IST

google News
    • Risabh Pant Walking: స్విమ్మింగ్ పూల్‌లో నడిచాడు రిషబ్ పంత్. అతడు గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా అతడు తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
రిషబ్ పంత్
రిషబ్ పంత్ (twitter)

రిషబ్ పంత్

Risabh Pant Walking: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బుధవారం (మార్చి 15) తన అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే వీడియో షేర్ చేశాడు. గతేడాది రోడ్డు ప్రమదంలో తీవ్రంగా గాయపడిన అతడు.. వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోను చూస్తే పంత్ గాయాల నుంచి చాలా వరకూ కోలుకున్నట్లు కనిపిస్తోంది.

తాజా వీడియోలో అతడు స్విమ్మింగ్ పూల్‌లో నడుస్తుండటం విశేషం. పూల్ లోనే చేతి కర్ర సాయంతో అటూ ఇటూ నడిచాడు. "చిన్న విషయాలు, పెద్ద విషయాలు, మధ్యలో జరుగుతున్న అన్నింటికీ నేను రుణపడి ఉన్నాను" అంటూ పంత్ ఈ వీడియోను షేర్ చేశాడు. గాయం తర్వాత పంత్ మోకాలికి కూడా సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం దాన్నుంచే అతడు కోలుకుంటున్నాడు. గతంలో ఆరుబయట నడుస్తున్న ఫొటోను షేర్ చేసిన పంత్.. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో నడుస్తూ తన కాళ్లలో బలాన్ని మరింత పెంచుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తూ కారు ప్రమాదంలో తీవ్రం గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతనికి ముంబైలో రెండు సర్జరీలు జరిగాయి.

అప్పటి నుంచి తన పరిస్థితిని వివరిస్తూ ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కిందట ఇన్‌స్టా స్టోరీస్ లో చెస్ ఆడుతున్న ఫొటోను కూడా పంత్ అభిమానులతో పంచుకున్నాడు. అయితే తాను ఎవరితో చెస్ ఆడుతున్నానో మాత్రం అతడు చెప్పలేదు. ఎవరితో ఆడుతున్నానో గెస్ చేయండి అనే క్యాప్షన్ తో ఈ ఫొటో పోస్ట్ చేశాడు.

పంత్ పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో ఐపీఎల్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. ఈ మధ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పంత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్ నిరాశపరిచాడు.

తదుపరి వ్యాసం