MS Dhoni Farming: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వీడియో వైరల్-ms dhoni farming video in instagram gone viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni Farming: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వీడియో వైరల్

MS Dhoni Farming: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Feb 08, 2023 08:26 PM IST

MS Dhoni Farming: ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ. రెండేళ్ల తర్వాత అతడు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. కొత్త విషయాలు నేర్చుకోవడం బాగుంటుందని అతడు అనడం విశేషం.

పొలం దున్నుతున్న ధోనీ
పొలం దున్నుతున్న ధోనీ (Dhoni Instagram)

MS Dhoni Farming: ఎమ్మెస్ ధోనీ.. ఓ ఆల్ రౌండర్. క్రికెట్ లో అతడు వికెట్ కీపర్ బ్యాటరే అయి ఉండొచ్చు. కానీ క్రికెట్ ఫీల్డ్ బయట మాత్రం అతను కచ్చితంగా ఆల్ రౌండరే. క్రికెట్ బిజినెస్ తోపాటు ఎన్నో వ్యాపారాలు, వ్యాపకాలు అతనికి ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు.

అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోస్ట్. ధోనీ ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న వీడియో అది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ వెనుకాడని ధోనీ.. ఇప్పుడిలా పొలం దున్నే పని కూడా నేర్చేసుకున్నాడు. "ఏదైనా కొత్తది నేర్చుకోవడం బాగానే ఉంటుంది కానీ ఈ పని పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయమే పట్టింది" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ధోనీ షేర్ చేసుకున్నాడు.

టైమ్ అయితే ఎక్కువ తీసుకున్నాడేమోగానీ.. పొలం దున్నే పనిని కూడా తన క్రికెటింగ్ బ్రెయిన్ తో పర్ఫెక్ట్ గానే చేసినట్లు కనిపిస్తోంది. ధోనీ అంతకుముందు 108 వారాల కిందట ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. అప్పుడు తన పొలంలోని స్ట్రాబెర్రీలను తీసుకొని తింటూ కనిపించాడు. "నేను ఇలాగే రోజూ పొలానికి వస్తూ ఉంటే మార్కెట్ లో ఇక స్ట్రాబెర్రీలే మిగలవు" అనే క్యాప్షన్ తో అతడు ఆ పోస్ట్ చేశాడు.

ఇప్పుడీ పొలం దున్నే వీడియో కూడా నిమిషాల్లోనే వైరల్ అయింది. పోస్ట్ చేసిన గంటలోనే సుమారు రెండు మిలియన్ల లైక్స్ రావడం విశేషం. ఇక ఈ మధ్యే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ధోనీ కలిసిన ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఫొటోను షేర్ చేసింది. ప్రిన్స్.. సూపర్ కింగ్ ను కలిశాడు అనే క్యాప్షన్ తో ఈ ఫొటో పోస్ట్ చేసింది.

ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2023 కోసం సిద్ధమవుతున్నాడు. నెట్స్ లో అతడు సిక్స్ లు కొట్టిన వీడియో కూడా ఈ మధ్యే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్లోనూ ఇప్పుడు రానున్న సీజనే ధోనీకి చివరిదిగా కనిపిస్తోంది.

సంబంధిత కథనం