CSK Captaincy Issue: స్టోక్స్ రాకతో చెన్నై కెప్టెన్ మారతారా? సీఎస్‌కే సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు-csk ceo kasi viswanathan reveals ms dhoni reaction at ben stokes joining ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Csk Captaincy Issue: స్టోక్స్ రాకతో చెన్నై కెప్టెన్ మారతారా? సీఎస్‌కే సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

CSK Captaincy Issue: స్టోక్స్ రాకతో చెన్నై కెప్టెన్ మారతారా? సీఎస్‌కే సీఈఓ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Dec 24, 2022 08:03 AM IST

CSK Captaincy Issue: బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరడంతో ఆ జట్టు కెప్టెన్ మారతాడా అనే అంశం గురించి చర్చ నడుస్తోంది. గత ఐపీఎల్‌కే ధోనీ సారథ్యాన్ని జడేజాకు ఇవ్వగా.. అతడు వదులుకోడంతో తిరిగి మిస్టర్ కూల్‌నే చేపట్టాడు. తాజాగా స్టోక్స్ రావడంతో కెప్టెన్సీ పగ్గాలు అతడికిస్తారనే ప్రచారం జరుగుతోంది.

బెన్ స్టోక్స్-ఎంఎస్ ధోనీ
బెన్ స్టోక్స్-ఎంఎస్ ధోనీ

CSK Captaincy Issue: ఐపీఎల్ 2023 కోసం నిర్వహించిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సామ్ కరన్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. అయితే ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్‌ను మాత్రం కొనుగోలు చేయడంలో సక్సెస్ అయింది. దీంతో చెన్నై శిభిరంలో ఆనందం వెల్లివిరిసింది. అభిమానులు కూడా స్టోక్స్ రాకతో ఫుల్ ఖూషీ అవుతున్నారు. ఇప్పటికే కెప్టెన్సీ వదులుకోవాలనుకుంటున్న ఎంఎస్ ధోనీ గత ఐపీఎల్ జడేజా‌కు ఇచ్చి విఫలయత్నం చేశాడు. కానీ ఈ సారి మాత్రం మిస్టర్ కూల్ సారథ్యం నుంచి తప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. స్టోక్స్ ధోనీ నుంచి పగ్గాలు రాబట్టుకుంటాడని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు.

"బెన్ స్టోక్స్‌ను దక్కించుకోవడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. చివరి వరకు ప్రయత్నించి ఎట్టకేలకు అతడిని సొంతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆల్‌రౌండర్ జట్టులోకి రావడంతో ధోనీ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక కెప్టెన్సీ విషయానికొస్తే ఇది పూర్తిగా ధోనీనే నిర్ణయం తీసుకోవాలి. త్వరలోనే ఏ విషయం అనేది అతడు తెలియజేస్తాడు." అని సీఎస్‌కే కాశీ విశ్వనాథన్ అన్నారు.

కైల్ జేమీసన్ గాయపడటంతో అతడిని ఎవ్వరూ తీసుకోలేదని ఆయన అన్నారు. "న్యూజిలాండ్ క్రికెటర్ కైల్ జేమీసన్ గాయపడటంతో ఫ్రాంఛైజీలు అతడిపై ఆసక్తి చూపించలేదు. అయితే అతడు కోలుకున్నాడని ఫ్లేమింగ్ నుంచి సమాచారం రావడంతో మేము తీసుకున్నాం. దీంతో సీఎస్‌కేకు మరో అదనపు ఆటగాడు వచ్చాడు. ఈ సీజన్‌లో మేము బాగా రాణిస్తామని అనుకుంటున్నాం. ఎల్లప్పుడు ఈ ప్రక్రియను మేము అనుసరిస్తాం. అది మాకు హెల్ప్ అవుతుంది" అని సీఎస్‌కే సీఈఓ స్పష్టం చేశారు.

కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్ వేలంలో 405 మంది ప్లేయర్లు పోటీ పడగా 80 మంది అమ్ముడుపోయారు. అందరికంటే ఎక్కువగా సామ్ కరన్‌ రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. అనంతరం ముంబయి కామెరూన్ గ్రీన్‌ను రూ.17.25 కోట్లకు కైవసం చేసుకోగా.. బెన్ స్టోక్స్‌ను చెన్నై రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం