IPL 2023 Sold Players List: ఐపీఎల్ 2023 వేలంలో ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!-here the full list of sold players in ipl 2023 mini auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Here The Full List Of Sold Players In Ipl 2023 Mini Auction

IPL 2023 Sold Players List: ఐపీఎల్ 2023 వేలంలో ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..!

Maragani Govardhan HT Telugu
Dec 23, 2022 10:03 PM IST

IPL 2023 Sold Players List: కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మొత్తం 405 ప్లేయర్లు పోటీ పడగా 80 మందిని కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. అత్యధికంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మంది ప్లేయర్లను సొంతం చేసుకుంది.

10 జట్లు సొంతం చేసుకున్న ఆటగాళ్లు
10 జట్లు సొంతం చేసుకున్న ఆటగాళ్లు

IPL 2023 Sold Players List: ఐపీఎల్ 2023 సీజన్ కోసం కొచ్చి వేదికగా జరిగిన ఐపీఎల్ వేలం ముగిసింది. ఈ వేలంలో 405 మంది ఆటగాళ్లు పోటీ పడగా.. 80 మంది ఆటగాళ్లను ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నాయి. వీరిలో 51 మంది భారత ప్లేయర్లు ఉండగా.. 29 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సామ్ కరణ్ రూ.18.50 కోట్లకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. అనంతరం కామెరూన్ గ్రీన్‌ను ముంబయి ఇండియన్స్ రూ.17.25 కోట్లకు సొంతం చేసుకుంది. బెన్ స్టోక్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 16.25 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా13 మంది ప్లేయర్లను దక్కించుకోగా.. దిల్లీ క్యాపిటల్స్ 5 గురును మాత్రమే కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023 వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్ల ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ముంబయి ఇండియన్స్..

కామెరూన్ గ్రీన్(రూ.17.5 కోట్లు), జై రిచర్డ్ సన్(1.50 కోట్లు, పియూష్ చావ్లా(50 లక్షలు), డుయాన్ జన్సెన్(20 లక్షలు), షామ్స్ ములానీ(రూ.20 లక్షలు),విష్ణు వినోద్(20 లక్షలు), నేహల్ వాదేరా(20 లక్షలు), రాఘవ్ గోయల్(20 లక్షలు). ఈ జట్టు వద్ద ఇంక 5 లక్షలు మాత్రమే ఉన్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్..

భగత్ వర్మ(రూ.20 లక్షలు), అజయ్ మండల్(20 లక్షలు), కైల్ జేమీసన్(రూ. కోటి), నిషాంత్ సింధు(రూ.60 లక్షలు), షేక్ రషీద్(రూ.20 లక్షలు), బెన్ స్టోక్స్(రూ.16.25 కోట్లు), అజింక్య రహానే(రూ.50 లక్షలు). చెన్నై వద్ద ఇంకా రూ.1.7 కోట్లు ఉన్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్..

అన్‌మోల్ ప్రీత్ సింగ్(రూ.20లక్షలు), అకీల్ హోసీన్(రూ. కోటి), నితీశ్ కుమార్(20 లక్షలు), మయాంక్ డాగర్(1.8 కోట్లు), ఉపేంద్ర యాదవ్(రూ.25 లక్షలు), సన్‌వీర్ సింగ్(రూ.20 లక్షలు), సమర్థ్ వ్యాస్(రూ.20 లక్షలు), వివ్రాంత్ శర్మ(రూ.2.6 కోట్లు), మయాంక్ మర్కాండే(50 లక్షలు), అదిల్ రషీద్(రూ.2 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్(రూ.5.25 కోట్లు), మయాంక్ అగర్వాల్(రూ.8.25 కోట్లు), హ్యారీ బ్రూక్(రూ.13.25 కోట్లు). సన్‌రైజర్స్ వద్ద ఇంకా రూ.6.75 కోట్ల మొత్తం ఉంది.

గుజరాత్ టైటాన్స్..

మోహిత్ శర్మ(రూ.50 లక్షలు), జోషువా లిటిల్(రూ.4.4 కోట్లు), శివమ్ మావి(రూ.6 కోట్లు), కేఎస్ భరత్(రూ.1.2 కోట్లు), ఓడీన్ స్మిత్(రూ.50 లక్షలు), కేన్ విలియమ్సన్(రూ.2 కోట్లు). గుజరాత్ వద్ద రూ.4.45 కోట్లు ఉంది.

పంజాబ్ కింగ్స్..

శివమ్ సింగ్(రూ.20 లక్షలు), మోహిత్ రాఠే(రూ.20 లక్షలు), విద్వత్ కవెరప్ప(రూ.20 లక్షలు), హర్ప్రీత్ భాటియా(రూ.40 లక్షలు), సికిందర్ రజా(రూ.50 లక్షలు), సామ్ కరన్(రూ.18.5 కోట్లు). పంజాబ్ వద్ద అత్యధికంగా రూ.12.2 కోట్లు ఉంది.

రాజస్థాన్ రాయల్స్..

ఆకాశ్ వశిష్ట్(రూ.20 లక్షలు), మురుగన్ అశ్విన్(రూ.20 లక్షలు), కేఎం ఆసిఫ్(రూ.30 లక్షలు), ఆడం జంపా(రూ.1.5 కోట్లు), కునాల్ రాథోడ్(రూ.20 లక్షలు), దోనోవన్ ఫియర్రా(రూ.50 లక్షలు), జేసన్ హోల్డర్(రూ.5.75 కోట్లు), జోయ్ రూట్(రూ.కోటి), అబ్దుల్ పీఏ(రూ.20 లక్షలు). రాజస్థాన్ వద్ద రూ.3.35 కోట్లు సొమ్ము ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్..

యుధ్‌వీర్ చరాక్(రూ.20 లక్షలు),నవీన్ ఉల్ హఖ్(రూ.20 లక్షలు), స్వప్నిల్ సింగ్(రూ. 20 లక్షలు), ప్రేరక్ మన్కడ్(రూ.20 లక్షలు), అమిత్ మిశ్రా(రూ.50 లక్షలు), డేనియల్ సామ్స్(రూ.75 లక్షలు), రొమారియో షెపర్డ్(రూ.50 లక్షలు), జయదేవ్ ఉనాద్కట్(రూ.50 లక్షలు), నికోలస్ పూరన్(రూ.16 కోట్లు). లక్నో వద్ద ఇంకా రూ.3.55 కోట్ల సొమ్ము ఉంది.

దిల్లీ క్యాపిటల్స్..

రిలీ రూసో(రూ.4.6 కోట్లు), మనీశ్ పాండే(రూ.2.4 కోట్లు), ముఖేష్ కుమార్(రూ.5.5 కోట్లు), ఇషాంత్ శర్మ(రూ.50 లక్షలు), ఫిల్ సాల్ట్(రూ.2 కోట్లు). దిల్లీ వద్ద ఇంకా రూ.4.45 కోట్లు ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

సోనూ యాదవ్(రూ.20 లక్షలు), అవినాశ్ సింగ్(రూ. 60 లక్షలు), రాజన్ కుమార్(రూ.70 లక్షలు), మనోజ్ భాండ్గే(రూ.20 లక్షలు), విల్ జాక్స్(రూ.3.2 కోట్లు), హిమాన్షు శర్మ(రూ.20 లక్షలు), రీసే టోప్లీ(రూ.1.9 కోట్లు). రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద ఇంకా రూ.1.95 కోట్ల సొమ్ము ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్..

మన్‌దీప్ సింగ్(రూ.50 లక్షలు), లిటన్ దాస్(రూ.50 లక్షలు), కుల్వంత్ ఖేజ్రోలియా(రూ.20 లక్షలు), డేవిడ్ వీస్(రూ. కోటి), సుయాష్ శర్మ(రూ.20 లక్షలు), వైభవ్ అరోరా(రూ.60 లక్షలు), ఎన్. జగదీశన్(రూ.90 లక్షలు), షకిబుల్ హసన్(రూ.1.5 కోట్లు). కోల్‌కతా వద్ద ఇంకా రూ.1.65 కోట్ల సొమ్ము ఉంది.

WhatsApp channel

సంబంధిత కథనం