IPL Auction 2023 Live Updates: ముగిసిన ఐపీఎల్ 2023 వేలం.. రికార్డు ధరకు అమ్ముడుపోయిన సామ్ కరన్
- IPL 2023 Auction Live Updates: ఐపీఎల్ 2023 వేలంలో ఊహించినట్లే రికార్డులు బ్రేకయ్యాయి. సామ్ కరన్ ఏకంగా రూ.18.5 కోట్లతో చరిత్ర సృష్టించాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇక కామెరాన్ గ్రీన్ ను ముంబై 17.5 కోట్లకు, బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొన్నాయి. నికొలస్ పూరన్ ను లక్నో రూ.16 కోట్లకు కొన్నది.
Fri, 23 Dec 202203:37 PM IST
ముగిసిన ఐపీఎల్ 2023 వేలం
ఐపీఎల్ 2023 వేలం ముగిసిపోయింది. ఫైనల్ రౌండులో జోయ్ రూట్‌ను అతడి బేస్ ప్రైజ్‌కు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఈ మినీ వేలంలో అందరికంటే ఎక్కువగా సామ్ కరన్ పలికాడు. అతడిని పంజాబ్ కింగ్స్ 18.50 కోట్లకు సొంతం చేసుకుంది.
Fri, 23 Dec 202202:56 PM IST
కేకేఆర్ గూటికి మన్‌దీప్ సింగ్
భారత దేశవాళీ ప్లేయర్ మన్ దీప్ సింగ్ ను కేకేఆర్ జట్టు సొంతం చేసుకుంది. 50 లక్షలకు అతడిని కొనుగోలుచేసింది. మరోపక్క మురుగన్ అశ్విన్ ను 20 లక్షలకు రాజస్థాన్ జట్టు కైవసం చేసుకుంది.
Fri, 23 Dec 202202:52 PM IST
రిలీ రూసోను దక్కించుకున్న దిల్లీ క్యాపిటల్స్
సౌతాఫ్రికన్ క్రికెటర్ రిలీ రూసోను దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అతడిని రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ తో పోటీ ఎదురైనప్పటికీ దిల్లీనే అతడిని దక్కించుకుంది.
Fri, 23 Dec 202202:12 PM IST
4.40 కోట్లకు జోషువాను కొన్న గుజరాత్
గుజరాత్ టైటాన్స్ జోషువా లిటిల్ ను కొనుగోలు చేసింది. దాదాపు రూ.4.40 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తో పోటీ వచ్చినప్పటికీ చివరకు ఈ ఆటగాడు గుజరాత్ గూటికే చేరాడు.
Fri, 23 Dec 202201:48 PM IST
మయాంక్ డాగర్‌ను దక్కించుకున్న సన్‌రైజర్స్
సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆటగాడిని సొంతం చేసుకుంది. మయాంక్ డాగర్ ను రూ.1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కోసం రాజస్థాన్ రాయల్స్ కూడా తీవ్రంగా పోటీ పడగా చివరకు హైదరాబాద్ జట్టే దక్కించుకుంది.
Fri, 23 Dec 202212:36 PM IST
రొమారియో షెపర్డ్, డేనియల్ సామ్స్‌ను సొంతం చేసుకున్న లక్నో
రొమారియో షెపర్డ్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపిచంకపోవడంతో అతడిని బేస్ ప్రైజ్‌కే లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. షేపర్డ్ బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు దక్కించుకుంది. మరోపక్క డేనియల్స్ సామ్స్‌ను కూడా రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.
Fri, 23 Dec 202211:57 AM IST
పేస్ బౌలర్ ముకేష్ కుమార్‌కు 5.5 కోట్లు.. సొంతం చేసుకున్న దిల్లీ
బెంగాల్ పేస్ బౌలర్ ముకేష్ కుమార్ కూడా భారీ మొత్తం పలికాడు. అతడిని దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5.5 కోట్లకు సొంతం చేసుకుంది. అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ కూడా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చివరకు దిల్లీనే సొంతం చేసుకుంది.
Fri, 23 Dec 202211:55 AM IST
భారీ మొత్తానికి శివమ్ మావిని సొంతం చేసుకున్న గుజరాత్
గతంలో కోల్‌కతా తరఫున ఆడిన యువ క్రికెటర్ శివమ్ మావిని.. ఈ సారి వేలంలో గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అతడిని రూ.6 కోట్లకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్‌కు శివమ్ మావి కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. భారీ మొత్తానికి గుజరాత్ అతడిని సొంతం చేసుకుంది.
Fri, 23 Dec 202211:37 AM IST
గుజరాత్ గూటికి చేరిన ఆంధ్ర ప్లేయర్ భరత్
ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. అతడిని 1.2 కోట్లకు కొనుగోలు చేసింది
Fri, 23 Dec 202211:35 AM IST
వివ్రాంత్ శర్మను రూ.2.6 కోట్లకు కొన్న సన్‌రైజర్స్
జమ్మూ కశ్మీర్ ప్లేయర్ వివ్రాంత్ శర్మను సన్‌రైజర్స్ రూ.2.6 కోట్లకు సొంతం చేసుకుంది. అతడి బేస్ ప్రైజ్ రూ.20 లక్షలే కాగా.. భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సౌరాష్ట్రకు చెందిన సమర్థ్ వ్యాస్‌ను కూడా రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.
Fri, 23 Dec 202210:59 AM IST
IPL Auction 2023 Live Updates: మయాంక్ మార్కండేను రూ.50 లక్షలకు కొన్న సన్‌రైజర్స్
స్పిన్నర్ మయాంక్ మార్కాండేను సన్‌రైజర్స్ హైదరాబాద్ అతని బేస్ ప్రైస్ రూ.50 లక్షలకే కొనుగోలు చేసింది. ఈ వేలంలో సన్‌రైజర్స్ హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కాండేను కొనడం విశేషం.
Fri, 23 Dec 202210:55 AM IST
IPL Auction 2023 Live Updates: ఆదిల్ రషీద్‌ను రూ.2 కోట్లకు కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్
ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను రూ.2 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అతన్ని బేస్‌ప్రైస్ దగ్గరే దక్కించుకుంది. మరే ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు.
Fri, 23 Dec 202210:53 AM IST
IPL Auction 2023 Live Updates: ఇషాంత్ శర్మకు రూ.50 లక్షలే
టీమిండియా పేస్ బౌలర్‌ను కేవలం రూ.50 లక్షలకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అతని కోసం మరెవరో బిడ్ దాఖలు చేయలేదు.
Fri, 23 Dec 202210:52 AM IST
IPL Auction 2023 Live Updates: జై రిచర్డ్‌సన్‌ను రూ.1.5 కోట్లకు కొన్న ముంబై ఇండియన్స్
ఆస్ట్రేలియా బౌలర్ జై రిచర్డ్‌సన్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అతని కోసం మరే ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు.
Fri, 23 Dec 202210:51 AM IST
IPL Auction 2023 Live Updates: జైదేవ్ ఉనద్కట్‌కు రూ.50 లక్షలే
ఇండియన్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్‌ను రూ.50 లక్షలకే కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్. అతన్ని బేస్ ప్రైస్ దగ్గరే సొంతం చేసుకుంది.
Fri, 23 Dec 202210:50 AM IST
IPL Auction 2023 Live Updates: రీస్ టోప్లీని రూ.1.9 కోట్లకు కొన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఇంగ్లండ్ పేస్ బౌలర్ రీస్ టోప్లీని రూ.1.9 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అతని కోసం ముంబై ఇండియన్స్ కూడా ప్రయత్నించింది.
Fri, 23 Dec 202210:46 AM IST
IPL Auction 2023 Live Updates: క్లాసెన్‌ను రూ.5.75 కోట్లకు కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్
సౌతాఫ్రికా బ్యాటర్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Fri, 23 Dec 202210:42 AM IST
IPL Auction 2023 Live Updates: నికొలస్ పూరన్‌ను రూ.16 కోట్లకు కొన్న లక్నో సూపర్ జెయింట్స్
వెస్టిండీస్ కెప్టెన్ నికొలస్ పూరన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చివరి వరకూ ఫైట్ చేసి పూరన్‌ను లక్నో దక్కించుకుంది.
Fri, 23 Dec 202210:34 AM IST
IPL Auction 2023 Live Updates: ఒకే సెట్‌లో రికార్డులు బ్రేక్
ఐపీఎల్ 2023 వేలంలో ఒకే సెట్‌లో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఏయే టీమ్స్ ఎవరిని కొనుగోలు చేశాయో చూద్దాం.
సామ్ కరన్ - రూ.18.5 కోట్లు (పంజాబ్ కింగ్స్)
కామెరాన్ గ్రీన్ - రూ.17.5 కోట్లు (ముంబై ఇండియన్స్)
బెన్ స్టోక్స్ - రూ.16.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
హ్యారీ బ్రూక్ - రూ.13.25 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
మయాంక్ అగర్వాల్ - రూ.8.25 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
Fri, 23 Dec 202210:13 AM IST
IPL Auction 2023 Live Updates: బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు కొన్న చెన్నై సూపర్ కింగ్స్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అతని కోసం సన్‌రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. చివరి నిమిషంలో బిడ్‌లోకి ఎంటరైన చెన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లతో స్టోక్స్‌ను ఎగరేసుకుపోయింది.
Fri, 23 Dec 202210:07 AM IST
IPL Auction 2023 Live Updates: కామెరాన్ గ్రీన్‌ను రూ.17.5 కోట్లకు కొన్న ముంబై ఇండియన్స్
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌కు ఊహించినట్లే ఐపీఎల్ వేలంలో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ చివరి వరకూ ఫైట్ చేసినా.. చివరికి ముంబై గ్రీన్‌ను ఎగరేసుకుపోయింది.
Fri, 23 Dec 202210:02 AM IST
IPL Auction 2023 Live Updates: జేసన్ హోల్డర్‌ను రూ.5.75 కోట్లకు కొన్న రాజస్థాన్ రాయల్స్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేస్ హోల్డర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.5.75 కోట్లకు కొనుగోలు చేసింది. చెన్నైతో పోటీ పడి మరీ అతన్ని రాయల్స్ దక్కించుకుంది.
Fri, 23 Dec 202209:57 AM IST
IPL Auction 2023 Live Updates: సికిందర్ రజాను రూ.50 లక్షలకు కొన్న పంజాబ్
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాను రూ.50 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.
Fri, 23 Dec 202209:55 AM IST
IPL Auction 2023 Live Updates: సామ్ కరన్‌కు రికార్డు ధర.. రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. ఐపీఎల్‌లో ఇదే రికార్డు ధర కావడం విశేషం.
Fri, 23 Dec 202209:47 AM IST
IPL Auction 2023 Live Updates: ఊహించినట్లే సామ్ కరన్ కోసం తీవ్ర పోటీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడుతున్నాయి. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్ల నుంచి శరవేగంగా బిడ్స్ దూసుకెళ్తున్నాయి. మొదట ముంబై, ఆర్సీబీ మధ్య, ఆ తర్వాత ముంబై, రాజస్థాన్ మధ్య పోటీ నెలకొంది.
Fri, 23 Dec 202209:46 AM IST
IPL Auction 2023 Live Updates: షకీబుల్ హసన్‌ను కొననుగోలు చేయని ఫ్రాంఛైజీలు
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. అతని బేస్‌ప్రైస్ రూ.1.5 కోట్లు.
Fri, 23 Dec 202209:36 AM IST
IPL Auction 2023 Live Updates: ముగిసిన బ్యాటర్ల వేలం.. సన్‌రైజర్స్‌కు మయాంక్, హ్యారీ బ్రూక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి సెట్‌లోనే ఇద్దరు బ్యాటర్లను కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు, మయాంక్‌ను రూ.8.25 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేయడం విశేషం. ఈ ఇద్దరి కోసం సన్‌రైజర్స్ గట్టిగా ప్రయత్నించి చివరికి సక్సెసైంది. వాళ్ల దగ్గర నిధులు భారీగా ఉండటంతో దూకుడుగా బిడ్స్ వేసింది.
Fri, 23 Dec 202209:34 AM IST
IPL Auction 2023 Live Updates: జో రూట్‌ను కొనుగోలు చేయని ఫ్రాంఛైజీలు
ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌పై ఫ్రాంఛైజీలు ఎవరూ ఆసక్తి చూపలేదు. రూ.కోటి బేస్ ప్రైస్‌తో ఉన్న అతని కోసం ఏ ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు.
Fri, 23 Dec 202209:33 AM IST
IPL Auction 2023 Live Updates: అజింక్య రహానేకు కేవలం రూ.50 లక్షలు
టీమిండియా బ్యాటర్ అజింక్య రహానేను రూ.50 లక్షలకే చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. అతన్ని బేస్ ప్రైస్‌కే చెన్నై దక్కించుకుంది. మరెవరో రహానే కోసం బిడ్ దాఖలు చేయలేదు.
Fri, 23 Dec 202209:31 AM IST
IPL Auction 2023 Live Updates: మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్
మయాంక్ అగర్వాల్ కోసం చెన్నై, సన్‌రైజర్స్ మధ్య పోటీ నడిచింది. దీంతో రూ.కోటి బేస్‌ప్రైస్‌తో మొదలైన అతని బిడ్ దూసుకెళ్తూనే ఉంది. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
Fri, 23 Dec 202209:23 AM IST
IPL Auction 2023 Live Updates: హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు కొన్న సన్‌రైజర్స్
ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అతని కోసం రాజస్థాన్ రాయల్స్ చివరి వరకూ ఫైట్ చేసినా.. వాళ్ల దగ్గర మొత్తం రూ.13.2 కోట్లు మాత్రమే ఉండటంతో రేసు నుంచి తప్పుకుంది.
Fri, 23 Dec 202209:12 AM IST
IPL Auction 2023 Live Updates: వేలంలో తొలి ప్లేయర్‌గా కేన్ విలియమ్సన్.. గుజరాత్ టైటన్స్‌కు..
మినీ వేలంలో తొలి ప్లేయర్‌గా కేన్ విలియమ్సన్ వచ్చాడు. అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. గుజరాత్ టైటన్స్ అతన్ని బేస్‌ప్రైస్ దగ్గరే కొనుగోలు చేయడం విశేషం.
Fri, 23 Dec 202209:08 AM IST
IPL Auction 2023 Live Updates: తొలి సెట్‌లో బ్యాటర్ల వేలం
ఐపీఎల్ 2023 వేలంలో భాగంగా తొలి సెట్‌లో బ్యాటర్లను వేలం వేయనున్నారు. ఇందులో భాగంగా మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రహానే, రూట్, రూసో, విలియమ్సన్‌లాంటి ప్లేయర్స్ రానున్నారు. ఇక రెండో సెట్‌లో ఆల్‌రౌండర్లను వేలం వేస్తారు.
Fri, 23 Dec 202209:05 AM IST
IPL Auction 2023 Live Updates: ప్రారంభమైన ఐపీఎల్ 2023 వేలం
ఐపీఎల్ 2023 మినీ వేలం ప్రారంభమైంది. పది ఫ్రాంఛైజీలు 405 మంది ఆటగాళ్లలో 87 మందిని తీసుకోవడానికి సిద్ధమయ్యాయి.
Fri, 23 Dec 202208:38 AM IST
IPL Auction 2023 Live Updates: కాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 వేలం
ఐపీఎల్ 2023 వేలం కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఈ మినీ వేలంలో మొత్తం 405 మంది ప్లేయర్స్ ఉండగా.. అందులో నుంచి 87 మంది ప్లేయర్స్‌ను పది ఫ్రాంఛైజీలు తీసుకునే వీలుంది.
Fri, 23 Dec 202208:22 AM IST
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్.. వేలంపై ప్రభావం ఎంత?
ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్‌ను తీసుకొస్తున్నారు. దీని ప్రకారం.. ఒక్కో టీమ్‌కు ఓ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ను మ్యాచ్ మధ్యలో పూర్తిగా తుది జట్టులో భాగం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ దేశవాళీ క్రికెటరే అయి ఉండాలన్న నిబంధన ఉంది. ఒకవేళ తుది జట్టులో నలుగురి కంటే తక్కువ మంది విదేశీ ప్లేయర్స్‌తో ఆడిన సందర్భంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా విదేశీ ప్లేయర్‌ను కూడా తీసుకునే వీలుంటుంది.
ఓ ఇన్నింగ్స్ ప్రారంభం కాక ముందే.. లేదంటే ఓ ఓవర్ పూర్తియిన సమయంలో లేదా వికెట్ పడినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌ను సదరు టీమ్ కెప్టెన్ ఫీల్డ్‌లోకి తీసుకురావచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ ఏ ప్లేయర్ స్థానంలో వస్తాడో ఆ ప్లేయర్‌కు ఇక మ్యాచ్‌లో కొనసాగే అవకాశం ఉండదు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ దేశవాళీ క్రికెటరే అయి ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఈ అంశాన్ని వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
Fri, 23 Dec 202208:17 AM IST
IPL Auction 2023 Live Updates: పొలార్డ్‌ను ముంబై ఎవరితో భర్తీ చేస్తుందో?
ముంబై ఇండియన్స్ టీమ్‌తో చాన్నాళ్ల పాటు ఉన్న కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. దీంతో అతని స్థానాన్ని ముంబై టీమ్ ఎవరితో భర్తీ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు విదేశీ ప్లేయర్స్ సహా మొత్తం 9 మందిని తీసుకునే అవకాశం ముంబైకి ఉంది. ఆ టీమ్ దగ్గర ప్రస్తుతం రూ.20.55 కోట్లు ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై గత వేలంలో చాలా వింతగా వ్యవహరించింది. ఆ టీమ్ స్థాయి ప్లేయర్స్‌ను కొనుగోలు చేయలేకపోయింది. దీంతో 2022 సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ఈసారి మినీ వేలంలో ఏం చేస్తుందో చూడాలి.
Fri, 23 Dec 202208:01 AM IST
IPL Auction 2023 Live Updates: సామ్ కరన్‌ను చెన్నై మళ్లీ తీసుకుంటుందా?
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కూడా ఈసారి వేలంలో రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో రాణించిన ఈ యువ బౌలర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడే అవకాశం ఉంది. అతన్ని రిలీజ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ వేలంలో కొనుగోలు చేస్తుందా అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆ టీమ్ దగ్గర రూ.20.4 కోట్లు ఉన్నాయి. కరన్‌తోపాటు ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఆడమ్ జంపా, ఆడమ్ మిల్న్, మనీష్ పాండే, సికందర్ రజాలాంటి ప్లేయర్స్‌పైనా చెన్నై కన్నేసింది.
Fri, 23 Dec 202207:31 AM IST
IPL 2023 Auction Live Updates: సన్‌రైజర్స్‌కు కెప్టెన్ ఎవరు?
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. దీంతో ప్రస్తుతం టీమ్‌కు కెప్టెన్ అంటూ లేడు. ఈ వేలంలో బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్‌లాంటి ఆల్‌రౌండర్ల కోసం సన్‌రైజర్స్ ప్రయత్నించవచ్చు. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠీ, అభిషేక్ శర్మ, ఏడెన్ మార్‌క్రమ్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌లాంటి వాళ్లను రిటేన్ చేసుకుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ దగ్గరే అత్యధికంగా రూ.42.25 కోట్ల పరిమితి మిగిలి ఉండగా.. ఆ టీమ్ నలుగురు విదేశీ ప్లేయర్స్‌ను తీసుకునే వీలుంది. ఇక మొత్తంగా 13 మంది ప్లేయర్స్‌ను తీసుకోవాల్సి ఉంది.
ప్రస్తుతం సన్‌రైజర్స్ టీమ్ ఇదీ
అబ్దుల్ సమద్, ఏడెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠీ, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో యాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్‌హక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
Fri, 23 Dec 202207:23 AM IST
ఐపీఎల్ 2023 వేలం లైవ్ ఎక్కడ, ఎప్పుడు..
ఐపీఎల్ 2023 సీజన్ కోసం నిర్వహించే వేలం కేరళలోని కొచ్చి వేదికగా జరగనుంది. 2022 డిసెంబరు 23 శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. 10 ఫ్రాంఛేజీలు ఈ వేలంలో పాల్గొననున్నాయి. ఐపీఎల్ 2023 వేలాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన అన్నీ ఛానల్లోనూ వీక్షించవచ్చు. అలాగే ఫోన్‌లో చూడాలనుకునేవారికి జియో సినిమా యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
Fri, 23 Dec 202207:16 AM IST
IPL 2023 Auction Live Updates: ఐపీఎల్‌లో ఏ ఫ్రాంఛైజీ దగ్గర ఎంత మొత్తం ఉందంటే?
సన్ రైజర్స్ హైదరాబాద్ - రూ.42.25 కోట్లు
పంజాబ్ కింగ్స్ - రూ.32.20 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ - రూ.23.35 కోట్లు
ముంబై ఇండియన్స్ - రూ.20.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ - రూ.20.45 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.19.45 కోట్లు
గుజరాత్ టైటన్స్ - రూ.19.25 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ - రూ.13.2 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ.8.75 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ.7.05 కోట్లు