Murali Vijay on Sehwag: సెహ్వాగ్‌కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు ఇవ్వలేదు.. లేదంటేనా?: మురళీ విజయ్
Murali Vijay on Sehwag: సెహ్వాగ్‌కు ఇచ్చినంత స్వేచ్ఛ నాకు ఇవ్వలేదు.. లేదంటే నేను కూడా బాగానే ఆడేవాడిని అని అన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. అదే సమయంలో వీరూపై ప్రశంసలు కురిపించాడు.
Murali Vijay on Sehwag: ఇండియన్ క్రికెట్ టీమ్‌కు టెస్టుల్లో నమ్మదగిన ఓపెనర్లు అంటే ఒకరు సునీల్ గవాస్కర్, ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగే గుర్తొస్తారు. ఓ బ్యాటర్‌కు ఎంతో అవసరమైన ఫుట్‌వర్క్ అసలు ఏమాత్రం లేకుండా టెస్టుల్లో పది వేలకు పైగా పరుగులు చేసిన ఘనత వీరూ సొంతం. అందులో రెండు ట్రిపుల్ సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉన్నాయి. బౌలర్ విసిరే బంతిని సరిగ్గా చూడటం, బంతి పిచ్ అయిన వెంటనే బాదడం సెహ్వాగ్ స్టైల్.
ఈ స్టైల్‌తోనే అతడు బౌలర్లకు చుక్కలు చూపించాడు. గంభీర్‌తో కలిసి టెస్టుల్లో మంచి ఓపెనింగ్ జోడీగా పేరుగాంచాడు. వాళ్ల తర్వాత ఇప్పటి వరకూ ఈ ఫార్మాట్‌లో ఇండియాకు మంచి ఓపెనింగ్ జోడీ దొరకడం లేదు. ధావన్, రాహుల్, రోహిత్‌లాంటి వాళ్లతో ప్రయత్నించినా అంత నిలకడగా రన్స్ చేసిన వాళ్లు లేరు. మధ్యలో మురళీ విజయ్ ఒక్కడే ధావన్‌తో కలిసి కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించాడు.
అయితే సెహ్వాగ్‌కు దక్కినంత స్వేచ్చ మాత్రం తనకు దక్కలేదని ఇప్పుడు విజయ్ అంటుండటం గమనార్హం. స్పోర్ట్స్‌స్టార్ కోసం డబ్ల్యూవీ రామన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు చివరిసారి 2018లో ఇండియాకు టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వీరూకి ఉన్నంత మద్దతు తనకు ఉండి ఉంటే తాను కూడా కెరీర్‌లో బాగానే సాధించే వాడినని చెప్పాడు.
"నిజాయతీగా చెప్పాలంటే వీరేంద్ర సెహ్వాగ్‌కు ఉన్నంత స్వేచ్ఛ నాకు లేదనే చెప్పాలి. సెహ్వాగ్‌కు తన జీవితంలో దక్కింది నాకు దక్కలేదు. సెహ్వాగ్‌లాగా నాకూ మద్దతు లభించి ఉంటే, ఓపెన్‌గా మాట్లాడే అవకాశం వచ్చి ఉంటే నేను కూడా ప్రయత్నించేవాడిని. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే టీమ్ మద్దతుతోపాటు మనం టీమ్‌కు ఏం చేస్తున్నామన్నది ముఖ్యమైన విషయం. చాలా పోటీ ఉంటుంది. ఎక్కువ అవకాశాలు దక్కవు. అందువల్ల ప్రయోగాలు చేయడం కుదరదు" అని విజయ్ అన్నాడు.
"నిలకడగా ఆడాల్సిందే. టీమ్ డిమాండ్‌కు తగినట్లు మనల్ని మనం ఎలా మలచుకుంటామన్నది ముఖ్యం. సెహ్వాగ్ ఆడుతున్న సమయంలో నా సహజ స్వభావాన్ని నియంత్రించుకుంటున్నానన్న భావన కలిగేది. అయితే సెహ్వాగ్ ఆ స్వేచ్ఛతో ఆడే తీరు మాత్రం అద్భుతంగా అనిపించేది" అని విజయ్ చెప్పాడు.
అయితే అదే సమయంలో సెహ్వాగ్ ఆటతీరుపైనా విజయ్ ప్రశంసలు కురిపించాడు. "అది సెహ్వాగ్‌కు మాత్రమే సాధ్యం. సెహ్వాగ్‌లాగా మరెవరూ ఆడలేరు. ఇండియన్ క్రికెట్‌కు అతడు చేసింది చాలా ఉంది. అతనితో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. అది చాలా సింపుల్. బాల్‌ను చూడాలి, బాదాలి అన్నదే అతని మంత్రం. గంటలకు 145-150 కి.మీ. వేగంతో వస్తున్న బాల్‌ను హాయిగా పాటలు పాడుతూ బాదేయడం నార్మల్ కాదు" అని విజయ్ అన్నాడు.