Bazball: బజ్‌బాల్ అంటే ఏంటో నాకు తెలియదు: ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్
Bazball: ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న టెస్ట్ క్రికెట్ స్టైల్‌కు అక్కడి మీడియా పెట్టిన పేరు బజ్‌బాల్. ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా దీని గురించి మాట్లాడుతుంటే.. ఇంగ్లండ్ కోచ్ మెకల్లమ్ మాత్రం అదేంటో తనకు తెలియదంటున్నాడు.
లండన్: టెస్ట్ క్రికెట్‌లో ఈ మధ్య ఇంగ్లండ్ సంచలనాలు సృష్టిస్తోంది. న్యూజిలాండ్‌పై మూడు మ్యాచ్‌లైనా, టీమిండియాపై చివరి టెస్ట్ అయినా భారీ స్కోర్లను సులువగా చేజ్ చేసేసింది. దీనికి అక్కడి మీడియా బజ్‌బాల్ స్టైల్ దూకుడైన క్రికెట్ అని పేరు పెట్టింది. కానీ ఈ పదమేంటో తనకు తెలియదని, ఇదొక సిల్లీ పదంగా తనకు అనిపిస్తోందని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అంటున్నాడు.
నిజానికి అతడు కోచ్‌గా వచ్చిన తర్వాతే ఇంగ్లండ్ టీమ్‌లో ఈ దూకుడు పెరిగింది. "నాకు తెలియదు. బజ్‌బాల్ గురించి నాకు ఐడియా లేదు. కానీ ప్లేయర్స్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నారు. నాకు ఇంత మంచి స్టార్ట్ కంటే ఇంకేం కావాలి. ప్లేయర్స్ వెళ్లడం, దూకుడుగా ఆడటం ఒక్కటే కాదు.. అందుకే నాకు ఆ సిల్లీ పదం నచ్చడం లేదు. ప్రతి ప్లేయర్ తన పర్ఫార్మెన్స్‌పై చాలా ఎఫర్ట్ పెడతాడు. తమపై ఉన్న ఒత్తిడిని కూడా మంచిగా స్వీకరిస్తారు. ప్లేయర్స్ ఈ పాజిటివ్ దృక్పథం కొనసాగిస్తారని అనుకుంటున్నా" అని మెకల్లమ్ అన్నాడు.
ఈ మధ్యే ఈ బజ్‌బాల్ స్టైల్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. తమ బౌలర్లు ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ చేస్తున్నా కూడా ఈ బజ్‌బాల్ కొనసాగుతుందా అని ప్రశ్నించాడు. వీటిపై కూడా మెకల్లమ్ స్పందించాడు. నిజానికి అతని కామెంట్స్ కరెక్టే అని, ఆస్ట్రేలియాతో ఆడటం ఓ పెద్ద సవాలని అన్నాడు. "ఇది మేం ఆడే తీరుకు సవాలు. అదే సమయంలో ఎక్సైటింగ్‌గా కూడా ఉంది. గేమ్‌లో ఉన్న మజా ఇదే కదా. బెస్ట్ ప్లేయర్స్‌తో తలపడి మరింత మెరుగవడం అనేది గేమ్‌లో భాగం" అని మెకల్లమ్ చెప్పాడు. వచ్చే ఏడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ యాషెస్‌లో తలపడనున్నాయి.
సంబంధిత కథనం