తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Karthik On Dhoni: ధోనీ నా స్థానాన్ని అలా లాక్కున్నాడు.. ఆ బాదుడే వాళ్లకు నచ్చింది: కార్తీక్

Karthik on Dhoni: ధోనీ నా స్థానాన్ని అలా లాక్కున్నాడు.. ఆ బాదుడే వాళ్లకు నచ్చింది: కార్తీక్

Hari Prasad S HT Telugu

27 February 2023, 14:18 IST

    • Karthik on Dhoni: ధోనీ నా స్థానాన్ని అలా లాక్కున్నాడు.. ఆ బాదుడే వాళ్లకు నచ్చింది అని అన్నాడు దినేష్ కార్తీక్. ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన కార్తీక్.. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ
దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ

దినేష్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ

Karthik on Dhoni: ఒకప్పుడు టీమిండియాకు విపరీతమైన వికెట్ కీపర్ల కొరత ఉండేది. 1990ల్లో నయన్ మోంగియా మాత్రమే కాస్త ఎక్కువ రోజులు జట్టులో ఉన్నాడు. అతని తర్వాత మళ్లీ ధోనీ వచ్చే వరకూ ఎంతో మంది వికెట్ కీపర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పంత్, ఇషాన్, సంజూ శాంసన్, భరత్, కేఎల్ రాహుల్.. ఇలా ఎంతో మంది టాలెంటెడ్ వికెట్ కీపర్లు జట్టులో చోటు కోసం పోటీ పడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అయితే ధోనీ జనరేషన్ లోనే జట్టులో స్థానం కోసం పోటీ పడిన కార్తీక్ అతని వల్ల నష్టపోయాడు. మంచి టాలెంట్ ఉన్న ప్లేయరే అయినా.. ధోనీలాంటి వికెట్ కీపర్, ఫినిషర్, కెప్టెన్ ముందు కార్తీక్ చిన్నబోయాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన కార్తీక్.. ధోనీ తన స్థానాన్ని ఎలా ఆక్రమించాడో చెప్పుకొచ్చాడు. ధోనీ కంటే ముందే కార్తీక్ జట్టులో స్థానం సంపాదించినా.. తర్వాత మిస్టర్ కూల్ కారణంగా కార్తీక్ కు ఎక్కువ అవకాశాలు రాలేదు.

"నేను అతని కంటే ముందే ఇండియన్ టీమ్ లోకి వచ్చాను. ఇండియా ఎ టూర్ కు కలిసి వెళ్లాం. అప్పుడు నేను ఇండియన్ టీమ్ కు ఎంపికయ్యాను. ధోనీతో కలిసి తొలిసారి నేను ఆడింది అప్పుడే. నేను బాగా ఆడటంతో ఇండియన్ టీమ్ లోకి ఎంపికయ్యాను.

ఆ తర్వాత మరో టూర్ కు వెళ్లాం. అక్కడ ధోనీ సిక్స్ లు, బౌండరీలు బాదాడు. అలాంటి ఆటకు ప్రపంచం అప్పుడప్పుడే అలవాటు పడుతోంది. ధోనీలాంటి ప్లేయర్ లేడు అని అందరూ అనడం మొదలుపెట్టారు. అతడో స్పెషల్ ప్లేయర్ అని అన్నారు.

నేను ఇండియన్ టీమ్ లోకి వచ్చే సమయానికే ధోనీ మానియా ఎంతలా ఉందంటే అతన్ని ఎంపిక చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఆ తర్వాత అతడు అన్ని ఫార్మాట్లలోనూ నా స్థానాన్ని భర్తీ చేశాడు. అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యం" అని కార్తీక్ అన్నాడు.

సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్ అనే పేరు సంపాదించడం కష్టంగా అనిపించేదా అని ప్రశ్నించగా.. తాను మరో అవకాశం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడినని, చాలా డొమెస్టిక్ క్రికెట్ ఆడటం తనకు కలిసొచ్చిందని చెప్పాడు. "అత్యుత్తమంగా ఎదగడానికి ప్రయత్నించాను. ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటర్ గా ఎదగాలని అనుకున్నాను.

ధోనీ ఉన్నాడా లేడా అన్నది పట్టించుకోలేదు. అతడు చాలా బాగా ఆడుతున్నాడు. ఇండియన్ టీమ్ లో సెటిలైపోయాడు. అతడు పొరపాట్లు చేయలేదు. అతన్ని బ్యాటింగ్ లో ప్రమోట్ చేయడంతో సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ లోనూ రాణించాడు. అతడు రాత్రికి రాత్రే బ్రాండ్ గా మారిపోయాడు. నన్ను ఎవరూ పట్టించుకోకపోయినా.. నేను ఎప్పుడూ అవకాశం కోసం ఎదురు చూస్తేనే ఉన్నాను" అని కార్తీక్ చెప్పాడు.