తెలుగు న్యూస్  /  Sports  /  Csk Skipper Dhoni 22 Runs Away From Rare Ipl Record

Dhoni Ipl Records: ఐపీఎల్‌లో అరుదైన రికార్డ్ చేరువ‌లో ధోనీ - తొలి మ్యాచ్‌లోనే బ్రేక్ చేస్తాడా?

26 February 2023, 11:48 IST

  • Dhoni Ipl Records: చెన్నై సూప‌ర్ కింగ్స్ సారథిగా ధోనీకి 2023 ఐపీఎల్ చివ‌రి సీజ‌న్‌ కావ‌చ్చునంటూ కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో బ్యాటింగ్ ప‌రంగా ధోనీ అరుదైన రికార్డుకు చేరువ అయ్యాడు. ఆ రికార్డ్ ఏదంటే...

ధోనీ
ధోనీ

ధోనీ

Dhoni Ipl Records: ధోనీకి రికార్డులు కొత్త కాదు. ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రికెట్‌తోపాటు ఐపీఎల్‌లో ధోనీ ఎన్నో తిరుగులేని రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. తాజాగా ఐపీఎల్‌లో అత‌డు మ‌రో కొత్త రికార్డుకు చేరువ‌లో ఉన్నాడు. మ‌రో 22 ప‌రుగులు చేస్తే ఐపీఎల్‌లో 5000 ప‌రుగులు పూర్తిచేసిన తొలి వికెట్ కీప‌ర్‌గా ధోనీ చ‌రిత్ర‌ను సృష్టించ‌నున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 234 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 4978 ర‌న్స్ చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లోనే ధోనీ 5000 ప‌రుగుల‌ రికార్డ్‌ను బ్రేక్ చేయ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు చెబుబోతున్నారు. ఈ సీజ‌న్‌లోనూ చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ధోనీ వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

ఇదే అత‌డికి చివ‌రి సీజ‌న్ కావ‌చ్చునంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. మార్చి 31 నుంచి మే 21 వ‌ర‌కు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి.

ఐపీఎల్ కోసం మార్చి 3 నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్రాక్టీస్ సెష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. మార్చి 2న ధోనీ చెన్నైకి చేరుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. గ‌త ఏడాది తొమ్మిదో స్థానంతో ఐపీఎల్‌ను ముగించింది చెన్నై సూప‌ర్ కింగ్స్‌.