Ishan Kishan Shubman Gill: యాక్టింగ్‌లో అదరగొట్టిన ఇషాన్, గిల్.. హోటల్ రూమ్‌లో రియాల్టీ షో సీన్ రీక్రియేట్
Ishan Kishan Shubman Gill: యాక్టింగ్‌లో అదరగొట్టారు టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్. హోటల్ రూమ్‌లో రియాల్టీ షోలోని ఓ సీన్ ను రీక్రియేట్ చేశారు. గిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Ishan Kishan Shubman Gill: క్రికెట్ ఫీల్డ్ లో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ సత్తా ఎంతో మనం చూశాం. రెండు నెలల్లో ఈ ఇద్దరూ వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. మొదట ఇషాన్ డబుల్ తో రికార్డు క్రియేట్ చేయగా.. గిల్ నెలలోపే దానిని బ్రేక్ చేశాడు. అయితే ఫీల్డ్ బయట మాత్రం ఈ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అంతేకాదు తమలో మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని నిరూపిస్తున్నారు.
తాజాగా గిల్ షేర్ చేసిన ఓ వీడియోనే దీనికి నిదర్శనం. న్యూజిలాండ్ తో బుధవారం (ఫిబ్రవరి 1) చివరి టీ20 ముగిసిన తర్వాత హోటల్ గదిలో ఈ ఇద్దరూ కలిసి ఓ రియాల్టీ షోలోని సీన్ ను రీక్రియేట్ చేశారు. ఇప్పుడీ ఫన్నీ వీడియో అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది. ఈ ఇద్దరికి ఇండియన్ టీమ్ లో అందరితోనూ సరదాగా ఉండే స్పిన్నర్ యుజువేంద్ర చహల్ కూడా తోడయ్యాడు.
ముగ్గురూ కలిసి ఎంటీవీ (MTV)లో వచ్చే రోడీస్ షోకు సంబంధించి ఆడిషన్ ఎపిసోడ్ లో జరిగిన ఓ ఫన్నీ సీన్ ను రీక్రియేట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఇషాన్ యాక్టింగ్ సూపర్. అతడు గొరిల్లాలాగా మారి గిల్ పై నుంచి దూకాడు. రోడీస్ షోలో తమ ఫేవరెట్ మూమెంట్ ను రీక్రియేట్ చేశామంటూ ఈ వీడియోను గిల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.
ఈ వీడియో చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అభిమానులే కాదు శివమ్ మావి, కృనాల్ పాండ్యా, కమలేష్ నగర్‌కోటి, రాహుల్ తెవాతియా, అంకిత రాజ్‌పుత్ లాంటి క్రికెటర్లు కూడా ఫన్నీ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. న్యూజిలాండ్ పై మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా 2-1తో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ లో గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
అతడు కేవలం 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. దీంతో ఇండియా మొదట 234 రన్స్ చేయగా.. తర్వాత న్యూజిలాండ్ ను 66 పరుగులకే కట్టడి చేసి 168 రన్స్ తేడాతో విజయం సాధించింది.
సంబంధిత కథనం