Sania Mirza As Rcb Mentor: టెన్నిస్ నుంచి క్రికెట్‌లోకి సానియా - ఆర్‌సీబీ టీమ్‌కు మెంటర్‌గా ఎంపిక
Sania Mirza As Rcb Mentor: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికెట్ పాఠాలు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు సానియా మీర్జా మెంటర్‌గా పనిచేయబోతున్నది.
Sania Mirza As Rcb Mentor: ఇటీవలే టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్ సానియా మీర్జా కొత్త కెరీర్‌ను మొదలుపెట్టబోతున్నది. టెన్నిస్ బ్యాట్ పక్కనపెట్టిన ఆమె క్రికెట్ పాఠాలు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కు సానియా మెంటర్‌గా పనిచేయబోతున్నది. మెంటర్‌గా నియమితురాలైన విషయాన్ని సానియా మీర్జా స్వయంగా ప్రకటించింది.
ఆర్‌సీబీ ఉమెన్స్ టీమ్‌కు మెంటర్‌గా పనిచేయబోతుండటం ఆనందంగా ఉందని తెలిపింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీని చాలా ఏళ్లుగా ఫాలో అవుతున్నానని, ఇప్పుడు కొత్తగా ఏర్పాటైన ఉమెన్స్ టీమ్‌తో కలిసి పనిచేయడానికి ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోన్నట్లు సానియా మీర్జా పేర్కొన్నది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంతో అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి కొత్త అడుగులు పడ్డాయని సానియా మీర్జా చెప్పింది. సానియా మీర్జా ఆర్‌సీబీ జెర్సీ ధరించిన ఫొటోలను టీమ్ మేనేజ్‌మెంట్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఒత్తిడిలో తమ ప్లేయర్లకు సానియా కంటే అత్యుత్తమంగా మార్గదర్శనం చేసే వారు ఎవరూ ఉండరని అనుకుంటున్నట్లు ఆర్‌సీబీ పేర్కొన్నది. ఛాంపియన్ అథ్లెట్‌కు స్వాగతం అంటూ ట్వీట్ చేసింది.
ఇటీవల జరిగిన వేలంలో ఆర్‌సీబీ.. స్మృతి మంథన, రిచా ఘోష్, రేణుక సింగ్‌తో పాటు పలువురు స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. వారితో కలిసి సానియా మీర్జా ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కాబోతున్నది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చివరగా బరిలో దిగింది సానియా మీర్జా. ఈ గ్లాండ్‌స్లామ్‌లో రోహన్ బోపన్నతో కలిసి మిక్సడ్ డబుల్స్‌లో ఫైనల్ చేరుకున్నది. ఫైనల్‌లో ఓటమి పాలైన సానియా, బోపన్న రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు.