Rishabh Pant Health Update: కోలుకుంటున్న పంత్ - నడుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన క్రికెటర్
Rishabh Pant Health Update: గత డిసెంబర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ తన హెల్త్ రికవరీపై సోషల్ మీడియా ద్వారా కీలక అప్‌డేట్ ఇచ్చాడు. వాకింగ్ స్టిక్స్ సహాయంతో నడుస్తోన్న ఫొటోను షేర్ చేశాడు.
Rishabh Pant Health Update: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ రికవరీకి సంబంధించి శుక్రవారం కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు పంత్. వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతడి కుడి కాలికి బ్యాండేజ్ కనిపిస్తోంది.
ఈ ఫొటోకు ఒక అడుగు ముందుకు సాగడానికి...ఒక అడుగు మానసికంగా ధృడంగా మరడానికి... ఒక అడుగు బెటర్‌లైఫ్ కోసం అంటూ పాజిటివ్ ట్వీట్ పోస్ట్ చేశాడు. పంత్ పోస్ట్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ త్వరగా కోలుకోవాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను ఉద్దేశించి రిప్లై ఇస్తున్నారు.
గత డిసెంబర్ లో డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వస్తోన్న క్రమంలో పంత్ కారు డివైడర్ రెయిలింగ్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో పంత్ తలతో పాటు కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇటీవలే పంత్‌కు ముంబాయిలో వైద్యులు సర్జరీ చేశారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌కు పంత్ దూరం కానున్నాడు.
టాపిక్