తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rashmika Mandanna On Ipl: రష్మిక ఫుల్ ఖుష్.. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోసం రిహార్సల్స్

Rashmika Mandanna on IPL: రష్మిక ఫుల్ ఖుష్.. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోసం రిహార్సల్స్

Hari Prasad S HT Telugu

31 March 2023, 12:29 IST

  • Rashmika Mandanna on IPL: రష్మిక ఫుల్ ఖుషీగా ఉంది. ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోసం రిహార్సల్స్ చేస్తోంది. శుక్రవారం (మార్చి 31) ఐపీఎల్ ప్రారంభం కాబోతుండగా.. రష్మిక, తమన్నా, అరిజిత్ సింగ్ పర్ఫామ్ చేయబోతున్నారు.

ఓపెనింగ్ సెర్మనీ కోసం తమన్నా రిహార్సల్స్
ఓపెనింగ్ సెర్మనీ కోసం తమన్నా రిహార్సల్స్ (PTI)

ఓపెనింగ్ సెర్మనీ కోసం తమన్నా రిహార్సల్స్

Rashmika Mandanna on IPL: రష్మిక మందన్నా ఎగిరి గంతేస్తోంది. తన జీవితంలో ఎప్పుడూ ఓ క్రికెట్ లైవ్ మ్యాచ్ లైవ్ చూడలేకపోయానని, కానీ ఇప్పుడు ఐపీఎల్ లాంటి మెగా ఈవెంట్ లో లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉందని ఆమె అంటోంది. మొత్తానికి సాధించాను అంటూ తెగ మురిసిపోతోంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఓపెనింగ్ సెర్మనీ కోసం తమన్నాతో కలిసి ఆమె రిహార్సల్స్ చేస్తోంది. ఈ సెర్మనీకి ముందు వాళ్లు ఇలా ఫీలవుతున్నారంటూ ఐపీఎల్ అధికారిక ట్విటర్ అకౌంట్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో తమన్నా, రష్మిక తమ ఎక్సైట్‌మెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వీళ్లు లైవ్ లో పర్ఫార్మ్ చేయబోతున్నారు.

నేషనల్ టెలివిజన్ లో నేషనల్ క్రష్ అంటూ ఓ అభిమాని ఈ పోస్ట్ పై కామెంట్ చేశారు. "క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు ఓపెనింగ్ సెర్మనీలోనే పర్ఫార్మ్ చేయబోతున్నాను. నేను సాధించాను" అంటూ ఆ వీడియోలో రష్మిక అనడం చూడొచ్చు. అటు తమన్నా కూడా ఈ లైవ్ పర్ఫార్మెన్స్ పై ఎక్సైటింగ్ గా ఉంది.

ఇక రష్మిక తన ఫేవరెట్ క్రికెటర్ల గురించి చెప్పింది. ధోనీ సర్, విరాట్ సర్ అంటూ ఆమె చెప్పడం విశేషం. శుక్రవారం (మార్చి 31) ఐపీఎల్ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. ఈసారి మొత్తం 12 వేదికల్లో 74 మ్యాచ్ లు జరగనున్నాయి. హైదరాబాద్ తోపాటు ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, జైపూర్, గువాహటి, ధర్మశాల, మొహాలీలలో మ్యాచ్ లు జరుగుతాయి.

గువాహటి రాయల్స్ రెండో హోమ్ గ్రౌండ్ కాగా.. ధర్మశాల పంజాబ్ రెండో హోమ్ గ్రౌండ్. అందుకే పది టీమ్సే ఉన్నా.. 12 వేదికల్లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. మే 28న ఫైనల్ తో 16వ సీజన్ ముగుస్తుంది. అంటే సుమారు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగే.