IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. రష్మిక, తమన్నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?-ipl 2023 opening ceremony to be held on friday march 31st as rashmika and tamannah to perform ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Opening Ceremony To Be Held On Friday March 31st As Rashmika And Tamannah To Perform

IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ.. రష్మిక, తమన్నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 10:06 PM IST

IPL 2023 Opening Ceremony: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ శుక్రవారం (మార్చి 31) జరగనుంది. ఇందులో రష్మిక, తమన్నా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సెర్మనీ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫార్మ్ చేయబోయేది వీళ్లేనా?
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో పర్ఫార్మ్ చేయబోయేది వీళ్లేనా?

IPL 2023 Opening Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ తో మరోసారి క్రికెట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూడు సీజన్ల తర్వాత మళ్లీ ఈసారి హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు జరుగుతుండటంతో దేశంలోని అన్ని నగరాల్లోని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి మన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు మ్యాచ్ లు ఆడనుంది.

ట్రెండింగ్ వార్తలు

అయితే ఈ సీజన్ ఐపీఎల్ ను కళ్లు చెదిరే ఓపెనింగ్ సెర్మనీతో ఘనంగా ప్రారంభించాలని నిర్వామకులు భావిస్తున్నారు. రెండు నెలల పాటు 74 మ్యాచ్ లు జరిగే ఈ మెగా లీగ్.. మార్చి 31న గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ తో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ

సుమారు లక్ష మంది ఈ ఓపెనింగ్ సెర్మనీ చూడనున్నారు. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఈ ఓపెనింగ్ సెర్మనీలో రష్మిక మందన్నా, తమన్నాతోపాటు బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్, సింగర్ అరిజిత్ సింగ్ లాంటి వాళ్లు పర్ఫార్మ్ చేయనున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం ఏదీ లేదు.

ఈ ఓపెనింగ్ సెర్మనీతోపాటు తొలి మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై చూడాలనుకుంటే.. జియో సినిమా యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి. ఐపీఎల్ 2023 మ్యాచ్ లన్నీ జియో సినిమాలో స్ట్రీమ్ కానున్నాయి. ఎవరైనా సరే ఇందులో ఉచితంగా ఐపీఎల్ మ్యాచ్ లు చూసే అవకాశం కల్పించడం విశేషం.

WhatsApp channel

సంబంధిత కథనం