Balayya in IPL: ఈసారి ఐపీఎల్ దబిడి దిబిడే.. బాలయ్యతో స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్పెషల్ ప్రోమో-balayya in ipl as the star sports telugu planned a special cricket live show with him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Balayya In Ipl As The Star Sports Telugu Planned A Special Cricket Live Show With Him

Balayya in IPL: ఈసారి ఐపీఎల్ దబిడి దిబిడే.. బాలయ్యతో స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్పెషల్ ప్రోమో

Hari Prasad S HT Telugu
Mar 28, 2023 08:23 PM IST

Balayya in IPL: ఈసారి ఐపీఎల్ దబిడి దిబిడే.. బాలయ్యతో స్టార్ స్పోర్ట్స్ తెలుగు స్పెషల్ ప్రోమో ఒకటి రూపొందించింది. ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ కోసం బాలయ్య లైవ్ షో చేయనుండటం విశేషం.

స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షో ప్రోమోలో బాలయ్య
స్టార్ స్పోర్ట్స్ తెలుగు క్రికెట్ లైవ్ షో ప్రోమోలో బాలయ్య

Balayya in IPL: వెండితెరపైనే కాదు.. ఈ మధ్య బుల్లితెరపై కూడా బాలకృష్ణ చెలరేగిపోతున్నాడు. ఆహా ఓటీటీలో ఇప్పటికే అన్‌స్టాపబుల్ షోతో అభిమానులకు మరింత దగ్గరైన అతడు.. ఇప్పుడు క్రికెట్ షోతో వస్తున్నాడు. ఈ శుక్రవారం (మార్చి 31) నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం స్టార్ స్పోర్ట్స్ తెలుగు బాలయ్య బాబుతో ప్రత్యేకమైన లైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది.

దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా ఆ ఛానెల్ రిలీజ్ చేసింది. ఇందులో బాలకృష్ణ తన మార్క్ డైలాగులతో తాను క్రికెట్ లైవ్ షో చేయబోతున్నట్లు చెప్పాడు. "క్రికెట్ అంటే మీకే కాదు.. నాకు కూడా ఊపొస్తుంది. ఇన్‌క్రెడిబుల్ ఐపీఎల్ అంటే ఆ అఫెక్షన్ రేంజే వేరు. తెలుగు కామెంట్రీతో టీవీలో చూస్తుంటే ఆ ఎమోషన్ లెవలే వేరు.

కుటుంబమంతా కలిసి సందడి చేస్తుంటే జోరుగా హుషారుగా ఉంటుంది. అందుకే ప్లేస్ మీరు చెప్పడం కాదు నేను చెబుతున్నాను. ఒకేషన్ టాటా ఐపీఎల్. లొకేషన్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు. మార్చి 31 నుంచి అపాయింట్‌మెంట్ ఫిక్స్. క్రికెట్ లైవ్ లో నేనూ వస్తున్నాను. ఇక ఆట అన్‌స్టాపబుల్. సాయంత్రం 5 గంటల నుంచి దబిడి దిబిడే" అంటూ బాలయ్య డైలాగులతో అదరగొట్టాడు.

ఈ క్రికెట్ లైవ్ షోలో బాలకృష్ణ ఎలా చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఈ మధ్యే స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఎక్స్‌పర్ట్స్, మాజీ క్రికెటర్లు ఎమ్మెస్కే ప్రసాద్, వేణుగోపాల రావుతో కలిసి బాలయ్య ఎన్‌బీకే108 సెట్లో గల్లీ క్రికెట్ కూడా ఆడాడు. తన క్రికెట్ అనుభవాలను ఈ సందర్భంగా వాళ్లతో పంచుకున్నాడు.

మార్చి 31 నుంచి మే 28వ తేదీ వరకు ఐపీఎల్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా లీగ్ లైవ్ ను ఇంగ్లిష్, హిందీతోపాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో మన భాషలోనూ చూడొచ్చు. తొలి రోజు నందమూరి బాలకృష్ణతో స్పెషల్ షో చేయనున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం