Ramcharan On Unstoppable Show: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోపై రామ్‌చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ramcharan On Unstoppable Show: ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం ఇటీవలే యూఎస్ వెళ్లాడు చరణ్. ప్రస్తుతం ఆర్‌ఆర్ఆర్ సినిమా రీ రిలీజ్ ప్రమోషన్స్, షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోపై రామ్‌చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
Ramcharan On Unstoppable Show: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా హాజరుకావడంపై రామ్‌చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తెలుగులో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ టాక్‌షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది. హోస్ట్‌గా బాలకృష్ణ కామెడీ టైమింగ్, గెస్ట్‌లను ప్రశ్నలు అడిగే తీరు అభిమానులను మెప్పిస్తున్నాయి. సెకండ్ సీజన్‌కు పవన్ కళ్యాణ్, ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్స్, పొలిటికల్ లీడర్స్ గెస్ట్‌లుగా హాజరుకావడం ఈ షో సక్సెస్‌కు నిదర్శనంగా నిలిచింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ టాక్‌షోలో పాల్గొనడంపై టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కోసం అమెరికాలో ఉన్న రామ్‌చరణ్ అక్కడి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అన్‌స్టాపబుల్‌షోకు హాజరు అవుతారా అని అడిగిన ప్రశ్నకు చరణ్ బదులిస్తూ బాలకృష్ణ ఆహ్వానిస్తే తప్పకుండా ఈ షోలో గెస్ట్‌గా పాల్గొంటానని అన్నాడు. బాలకృష్ణ ట్రూలీ అన్‌స్టాపబుల్ అంటూ అతడిపై చరణ్ ప్రశంసలు కురిపించాడు.
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌తో పాటు ప్రభాస్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఫోన్ ద్వారా రామ్‌చరణ్‌తో మాట్లాడారు. అప్పుడు కూడా షోకు హాజరవుతానని బాలకృష్ణతో చెప్పాడు రామ్‌చరణ్. అమెరికా టూర్‌లో అన్‌స్టాపబుల్‌పై చరణ్ చేసిన కామెంట్స్ చూస్తుంటే తప్పకుండా అతడు ఈ షోలో గెస్ట్‌గా పాల్గొనడం ఖాయంగానే కనిపిస్తోంది.
అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో మూడో సీజన్‌లో రామ్‌చరణ్ ఈ షోకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తోన్నాడు. అలాగే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు చరణ్.