IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?-ipl records as the mumbai indians tops the table with most wins
Telugu News  /  Sports  /  Ipl Records As The Mumbai Indians Tops The Table With Most Wins
విజయాల్లో ముంబై ఇండియన్స్ టాప్
విజయాల్లో ముంబై ఇండియన్స్ టాప్ (PTI)

IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా?

28 March 2023, 17:42 ISTHari Prasad S
28 March 2023, 17:42 IST

IPL Records: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్ ఏదో తెలుసా? ఈ లీగ్ ను ఎక్కువసార్లు గెలిచిన టీమ్సే ఈ ఓవరాల్ మ్యాచ్ ల విజయాల్లోనూ టాప్ లో ఉన్నాయి.

IPL Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ టైమ్ దగ్గర పడింది. ఈ శుక్రవారం (మార్చి 31) నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 10 జట్లు మూడు సీజన్ల తర్వాత తొలిసారి హోమ్, అవే పద్ధతిలో మ్యాచ్ లు ఆడబోతున్నాయి. సమ్మర్ వేడిలో రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్ కు చల్లని సాయంత్రాలు అందించడానికి ఐపీఎల్ వస్తోంది.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఐపీఎల్లో ఏ టీమ్ అత్యధిక విజయాలు సాధించిందో ఓసారి చూద్దాం. 2022 సీజన్ వరకు ఐదు టైటిల్స్ తో ముందున్న ముంబై ఇండియన్స్ ఈ అత్యధిక విజయాల్లోనూ టాప్ లో ఉంది. ఆ తర్వాత నాలుగుసార్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రెండు టైటిల్స్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ టీమ్ ఎన్ని మ్యాచ్ లు ఆడింది? ఎన్ని గెలిచిందో ఒకసారి చూద్దాం.

విజయాల్లో టాప్ టీమ్ ఇదే

- ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్లో 231 మ్యాచ్ లు ఆడి 129 గెలిచి, 97 ఓడిపోయింది. మరో 4 టైగా కాగా.. ఒక మ్యాచ్ రద్దయింది.

- చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ 209 మ్యాచ్ లు ఆడి 121 గెలిచింది. 86 ఓడిపోయింది. ఒకటి టై కాగా.. మరో దాంట్లో ఫలితం తేలలేదు.

- కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ 226 మ్యాచ్ లలో 113 గెలిచి, 106 ఓడిపోయింది. మూడు టై కాగా, మూడింట్లో ఫలితం తేలలేదు. ఒకటి రద్దయింది.

- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 228 మ్యాచ్ లలో 107 గెలిచి, 113 ఓడిపోయింది. మూడు టై, మూడు ఫలితం తేలకపోగా 2 రద్దయ్యాయి.

- ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 225 మ్యాచ్ లలో 100 గెలిచి, 118 ఓడిపోయింది. 4 టై కాగా.. రెండు ఫలితం తేలలేదు. ఒకటి రద్దయింది.

- పంజాబ్ కింగ్స్ టీమ్ 218 మ్యాచ్ లలో 98 గెలిచి, 116 ఓడిపోయింది. 4 టై అయ్యాయి.

- రాజస్థాన్ రాయల్స్ టీమ్ 194 ఆడగా 94 గెలిచి, 93 ఓడిపోయింది. 3 టై అయ్యాయి. 4 ఫలితం తేలలేదు.

- సన్ రైజర్స్ హైదరాబాద్ 152 మ్యాచ్ లలో 74 గెలిచి, మరో 74 ఓడిపోయింది. 4 టై అయ్యాయి.

- గుజరాత్ టైటన్స్ 16 మ్యాచ్ లలో 12 గెలిచి, 4 ఓడిపోయింది.

- లక్నో సూపర్ జెయింట్స్ 15 మ్యాచ్ లలో 9 గెలిచి, 6 ఓడిపోయింది.

సంబంధిత కథనం