Telugu News  /  Andhra Pradesh  /  Tdp Mla Balakrishna Strong Warning To Ycp Leaders
నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Warning: నన్ను అలా అంటే దబిడి దిబిడే

26 January 2023, 22:14 ISTHT Telugu Desk
26 January 2023, 22:14 IST

MLA Nandamuri Balakrishna On YCP Govt: వైసీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ఇక తనకు 60 ఏళ్లు వచ్చాయని, వయసు పైబడిందని ఎవరైనా అంటే దబిడి దిబిడే అంటూ తనదైన శైలిలో నవ్వుతూ కామెంట్స్ చేశారు.

MLA Nandamuri Balakrishna: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం హిందూపురంలో పర్యటించారు. అక్కడ సరస్వతీ విద్యా మందిర్ లో కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. రాయలసీమలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వలసలు పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు నోటిఫికేషన్ రావటం లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ముఖ్యమంత్రి జగన్‌కు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. ఓట్లేసి గెలిపించుకుంటే బాదుడే బాదుడు తెచ్చారని ఆరోపించారు. మూడు రాజధానులంటూ మూడేళ్లు గడిపారని.. ల్యాండ్, శాండ్, వైన్ అన్నింటినీ వైసీపీ దోచేసిందని ధ్వజమెత్తారు. జగన్‌కి ఒక్క అవకాశం ఇస్తే ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన బాలకృష్ణ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక పరిశ్రమలు తీసుకొస్తామని అన్నారు.

వార్నింగ్…

ఇక ఎవరైనా తనకు 60 సంవత్సరాలు అని.. వయసు అయిపోయిందని అంటే వాడికి దబిడి దిబిడే అంటూ బాలకృష్ణ వార్నింగ్‌ ఇచ్చాడు. సేవా కార్యక్రమాలు చేయాలంటే అధికారంలోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఇక అక్కినేని కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావును తాను కావాలని కించపరచలేదని బాలకృష్ణ స్పష్టం చేశాడు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ఇద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కాళ్లలాంటి వాళ్లని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు తనకు బాబాయ్‌ లాంటి వాడని చెప్పుకొచ్చారు ఆయన పిల్లల కంటే కూడా తననే ఎక్కువగా అప్యాయంగా చూసుకునేవాడని అన్నారు.

ఇక బాలకృష్ణ దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇవ్వటంపై చర్చ జరుగుతోంది. అక్కినేని కుటుంబంపై బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి రోజా… కొన్ని కామెంట్స్ చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి… వయస్సు పెరిగినప్పటికీ బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. అయితే తాజాగా బాలకృష్ణ ఇచ్చిన వార్నింగ్… కేవలం మంత్రి రోజాను ఉద్దేశించి ఇచ్చారా..? లేక వైసీపీ నేతలను ఉద్దేశించి చేశారా..? అనేది ఆసక్తికరంగా మారింది.

తప్పిన ప్రమాదం…

హిందూపురం పర్యటనలో భాగంగా ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర వైసీపీ నాయకుల్లో భయం కలిగిస్తోందన్నారు. ప్రసంగించిన తర్వాత బాలకృష్ణ వాహనం దిగుతుండగా పక్కకు పడిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై పట్టుకోవడంతో బాలకృష్ణకు ప్రమాదం తప్పినట్లు అయింది.