తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Players : అన్ని సీజన్‌లలో ఐపీఎల్ ఆడిన 7 మంది ఆటగాళ్లు ఎవరో తెలుసా?

IPL Players : అన్ని సీజన్‌లలో ఐపీఎల్ ఆడిన 7 మంది ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Anand Sai HT Telugu

04 May 2023, 15:03 IST

    • IPL 2023 : ఐపీఎల్ ప్రారంభమై 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో ప్రారంభమైన ఈ గ్రాండ్ టోర్నీ 16వ ఎడిషన్ జోరుగా సాగుతోంది. ఈ అన్ని ఎడిషన్లలో కేవలం 7 మంది ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. వాళ్లు ప్రతీ ఐపీఎల్ లో ఉన్నారు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (AP)

విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2023(IPL 2023) జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ అన్ని సీజన్లు చూసుకుంటే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే 2008 నుండి 2023 వరకు ప్రతి సీజన్‌లో ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. ఆ ఆటగాళ్లు ఎవరు? ఏ జట్టు కోసం ఆడారు అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

2008 నుంచి ఆర్‌సీబీ(RCB) తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పటికీ బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక కాలం ఒకే జట్టు తరఫున ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడడం ద్వారా ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.

మొదటి ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన ధోని(Dhoni), ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కు ఆడాడు. ఇప్పుడు సీఎస్‌కే జట్టులోనే కొనసాగుతున్నాడు.

2008లో KKR తరపున ఆడటం ద్వారా తన IPL కెరీర్‌ను ప్రారంభించిన వృద్ధిమాన్ సాహా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తరపున ఆడుతున్నాడు.

2008లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరపున ఆడిన శిఖర్ ధావన్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.

దినేశ్ కార్తీక్(Dinesh Karthik) తన IPL కెరీర్‌ను 2008లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, RCB, గుజరాత్ లయన్స్, KKR తరపున ఆడాడు. ఇప్పుడు అతను RCB జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తున్నాడు.

తొలి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మనీష్ పాండే(Manish Pandey), ఆ తర్వాత RCB, పూణే వారియర్స్, KKR, SRH, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు.

ఈ 7 మంది ఆటగాళ్లు 2008 నుండి 2023 వరకు IPL ప్రతి సీజన్‌లో ఆడారు. ఈ జాబితాలో విదేశీ ఆటగాళ్లెవరూ లేకపోవడం విశేషం.