Virat Kohli Diet Plan : విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే.. మీరు ఆ డైట్ ఫాలో అవుతారా?
Virat Kohli Diet Plan : విరాట్ కోహ్లీ యూత్ కు ఫిట్‌నెస్ ఐకాన్. అతడు తనను తాను ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకుంటాడు. లక్ష్యం వైపు ఏకాగ్రతతో ఉంటాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ రహస్యం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
క్రికెట్ ప్రపంచంలో ఫిట్‌నెస్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ(Virat Kohli) పేరును అస్సలు మర్చిపోలేరు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్(virat kohli fitness) ఐకాన్‌గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అతని జిమ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. విరాట్ కోహ్లీ భారత క్రికెటర్లలో ఫిట్‌నెస్ గా ఉండేవాళ్లలో మెుదట ఉంటాడు. తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి, విరాట్ కోహ్లి కఠినమైన ఆహారాన్ని అనుసరించడంతోపాటు జిమ్‌లో గంటల తరబడి ఉంటాడు. ఏకాగ్రత, ఫిట్‌గా ఉండటానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటాడు.
ఫిట్‌గా ఉండేందుకు స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతానని విరాట్(Virat) ఒకసారి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను ఫీల్డ్‌లో పనితీరును ప్రభావితం చేసే ఏదైనా తినడానికి అనుమతించడు.
బ్రేక్‌ఫాస్ట్(Breakfast)లో బ్రెడ్ ఆమ్లెట్‌తో ఉడకబెట్టిన గుడ్లను విరాట్ తింటాడు. దీనితో పాటు విరాట్ అల్పాహారంగా పాలకూర, ఎండుమిర్చి, పనీర్ సలాడ్ తింటాడు.
విరాట్ మధ్యాహ్న భోజనంలో నట్స్, బ్రౌన్ బ్రెడ్ మరియు స్వీట్లు తింటాడు. దీంతో లంచ్‌లో ప్రొటీన్ షేక్ తీసుకుంటాడు.
విరాట్ డిన్నర్(Dinner) చాలా సింపుల్. ఇందులో రోటీ, పప్పు, పచ్చి ఆకు కూరలు ఉంటాయి.
విరాట్ తనను తాను హైడ్రేట్ గా ఉంచుకోవడానికి బ్లాక్ వాటర్(Black Water) తాగుతాడు. బ్లాక్ వాటర్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటి ధర లీటరుకు 3000 నుండి 4000 రూపాయల వరకు ఉంటుంది. వ్యాయామం చేసిన తర్వాత, విరాట్ ప్రోటీన్ షేక్స్, సోయా మిల్క్, బటర్ పనీర్ తింటాడు. ఇవన్నీ విరాట్ ఫిట్‌గా ఉండటానికి సహాయపడతాయి.