Allu Arjun -Punjab Kings Cricketers: పుష్పరాజ్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ - ఫొటో వైరల్
Allu Arjun -Punjab Kings Cricketers: అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ క్రికెటర్స్ కలిశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Allu Arjun -Punjab Kings Cricketers: పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు అల్లు అర్జున్. పుష్పరాజ్ పాత్రలో తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చూపించిన ఆటిట్యూడ్, మేనరిజమ్స్ తో అతడి స్టైల్ కు భాషాబేధాలకు అతీతంగా చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇండియన్ క్రికెటర్స్‌తో పాటు ఇంటర్‌నేషనల్ క్రికెటర్స్ కూడా అల్లు అర్జున్ పుష్ఫ స్టైల్‌ను మ్యాచ్‌లలో అనుకరించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. అతడి యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించారు.
అల్లు అర్జున్‌పై అభిమానంతో పంజాబ్ కింగ్స్ క్రికెటర్స్ అతడిని కలుసుకున్నారు. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ ఆదివారం తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ ప్లేయర్స్ శుక్రవారం హైదరాబాద్ వచ్చారు.
మ్యాచ్‌కు ముందు కాస్త విరామం లభించడంతో పంజాబ్ స్పిన్నర్స్ రాహుల్ చాహర్, హర్‌ప్రీత్‌బ్రార్ ఇద్దరు అల్లు అర్జున్ కలిశారు. అతడితో కలిసి దిగిన ఫొటోను రాహల్ చాహర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. చాహర్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బన్నీ ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేస్తోన్నారు. కాగా
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప -2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్ ఫస్ట్‌లుక్‌తో పాటు వీడియో టీజర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌కు చక్కటి స్పందన లభిస్తోంది.
టాపిక్