తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Icc Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ము రేపిన విరాట్ కోహ్లి, అశ్విన్

ICC Test rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ము రేపిన విరాట్ కోహ్లి, అశ్విన్

Hari Prasad S HT Telugu

15 March 2023, 16:10 IST

    • ICC Test rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో దుమ్ము రేపారు ఇండియన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి, అశ్విన్, అక్షర్ పటేల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించిన ఈ ప్లేయర్స్ ర్యాంకింగ్స్ లోనూ సత్తా చాటారు.
విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్
విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ (ANI/Getty)

విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్

ICC Test rankings: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఇండియా 2-1తో ఓడించిన విషయం తెలుసు కదా. ఈ సిరీస్ లో రాణించిన ఇండియన్ టీమ్ ప్లేయర్స్ తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకుల్లోనూ సత్తా చాటారు. ముఖ్యంగా చివరి టెస్టులో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన అశ్విన్, బంతి కంటే బ్యాట్ తో ఎక్కువగా రాణించిన అక్షర్ పటేల్ మెరుగైన ర్యాంకులు సాధించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

1205 రోజుల తర్వాత టెస్టులలో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి తాజా ర్యాంకుల్లో 13వ స్థానానికి చేరాడు. అతడు ఏడుస్థానాలు పైకి ఎగబాకాడు. ఒకప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ బ్యాటర్ అయిన విరాట్.. గతేడాది జులైలో టాప్ 10 నుంచి కూడా బయటకు వెళ్లిపోయాడు. చివరి టెస్టులో 186 రన్స్ చేసిన కోహ్లి.. టాప్ 10లోకి అయితే రాలేదు కానీ దానికి దగ్గరగా వచ్చాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. తాజా ర్యాంకుల్లో రిషబ్ పంత్ ఐదు, రోహిత్ శర్మ పదో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. ఇక అశ్విన్ తన నంబర్ వన్ స్ఠానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. గతవారం ఆండర్సన్ తో కలిసి సంయుక్తంగా నంబర్ వన్ గా నిలిచిన అశ్విన్.. ఇప్పుడు ఒక్కడే నంబర్ వన్ అయ్యాడు.

కెరీర్లో 32వ ఐదు వికెట్ల ప్రదర్శనతో అతడు 869 పాయింట్లతో నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. ఆండర్సన్ 859 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ మొత్తం 26 వికెట్లు తీసుకున్నాడు. అటు బ్యాట్ తో రాణించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటర్ల ర్యాంకుల్లో 44వ స్థానానికి చేరాడు. అక్షర్ ఈ సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలు సహా 264 పరుగులు చేశాడు.