Australia Squad For Odi Series: ఇండియాతో వన్డే సిరీస్ ఆడనున్న ఆస్ట్రేలియా టీమ్ ఇదే - కెప్టెన్‌గా స్మిత్
Australia Squad For Odi Series: భారత్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియా వన్డే జట్టుకు స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
Australia Squad For Odi Series: టీమ్ ఇండియా చేతిలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా వన్డే సమరానికి సిద్ధమైంది. టెస్టుల్లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో బలమైన టీమ్‌తో బరిలో దిగుతోంది. ఇండియాతో వన్డే సిరీస్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా టీమ్‌ను మేనేజ్‌మెంట్ ప్రకటించింది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా పరువు కాపాడిన సీనియర్ ప్లేయర్ స్మిత్‌పై మరోసారి నమ్మకాన్ని ఉంచిన టీమ్ మేనేజ్‌మెంట్ అతడికే కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగించింది. వన్డేజట్టుకు ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాల్సింది. కానీ కుటుంబ సమస్యల కారణంగా అతడు సిరీస్‌కు దూరం కావడంతో స్మిత్ ను కెప్టెన్‌గా ఎంపికచేశారు.
గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ వన్డేలు ఆడనున్నాడు. మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్ లాంటి హిట్టర్లను ఎంపికచేశారు. మార్చి 17 నుంచి 22 వరకు వన్డే సిరీస్ జరుగనుంది. తొలి వన్డేకు ముంబాయిలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆస్ట్రేలియా వన్డే జట్టు ఇదే
స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రిచర్డ్‌సన్, స్టార్క్, స్టోయినిస్, ఆడమ్ జంపా, డేవిడ్ వార్నర్...