Ashwin Counter to Pujara: నువ్వు బౌలింగ్ చేస్తే నేను ఏం చేయాలి.. పని మానుకోమంటావా? పుజారాకు అశ్విన్ కౌంటర్-ravichandran ashwin hilarious tweet on pujara bowling ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravichandran Ashwin Hilarious Tweet On Pujara Bowling

Ashwin Counter to Pujara: నువ్వు బౌలింగ్ చేస్తే నేను ఏం చేయాలి.. పని మానుకోమంటావా? పుజారాకు అశ్విన్ కౌంటర్

Maragani Govardhan HT Telugu
Mar 14, 2023 02:10 PM IST

Ashwin Counter to Pujara: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తన సహచర ఆటగాడు ఛతేశ్వర్ పుజారాకు ఫన్నీ కౌంటర్ ఇచ్చాడు. పుజారా బౌలింగ్ చేసే ఫొటోను షేర్ చేస్తూ.. "నువ్వు బౌలింగ్ చేస్తే నేనేమి చేయాలి" అంటూ ట్వీట్ చేశాడు.

పుజారా-అశ్విన్
పుజారా-అశ్విన్

Ashwin Counter to Pujara: ఆస్ట్రేలియాతో జరిగిన అహ్మదాబాద్ టెస్టు ఐదో రోజున డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఫలితంగా 2-1 తేడాతో భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఛతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ కొత్త అవతారమెత్తారు. ఇద్దరూ నెట్ బౌలర్లుగా మారి కొన్ని బంతులను విసిరారు. అయితే పుజారా బౌలింగ్ చేయడాన్ని చూసిన అశ్విన్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఫన్నీగా అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు పుజారా కూడా రిప్లయి ఇవ్వడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

"నువ్వు బౌలింగ్ చేస్తే నేను ఏం చేయమంటావ్? ఉద్యోగం మానుకోమంటావా?" అని అశ్విన్ హిందీలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టుకు పుజారా బౌలింగ్ చేస్తున్న ఫొటోను కూడా జత చేశాడు. అశ్విన్ ట్వీట్‌కు పుజారా స్పందించాడు. "వద్దు..నాగ్‌పుర్ టెస్టులో నువ్వు వన్డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగావు కదా.. అందుకే ఇలా థ్యాంక్యూ చెబుతున్నాను" అంటూ అశ్విన్‌కు పుజారా ఫన్నీగా రిప్లయి ఇచ్చాడు.

అయితే సంభాషణను అశ్విన్ మరింత కొనసాగించాడు. పుజారా ట్వీట్‌కు బదులిస్త్తూ మరో ట్వీట్ చేశాడు. "నీ ఉద్దేశాన్ని ప్రశంసిస్తున్నాను. అయితే ఇది ఎలా పేబ్యాక్ అవుతుందో అర్థం కాక వింతగా అనిపిస్తుంది." అని అశ్విన్ బదులిచ్చాడు. అనంతరం పుజారా కూడా టీమిండియా స్పిన్నర్‌కు మరోసారి రిప్లయి ఇచ్చాడు. "నీకు తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అవసరమైతే నువ్వు మళ్లీ వన్డౌన్‌లో దిగవచ్చు." అంటూ భారత టెస్టు బ్యాటర్‌ స్పష్టం చేశాడు.

వీరిద్దరి సంభాషణ ఆద్యంతం ఫన్నీగా సాగింది. సోషల్ మీడియాలో ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా వీరి ట్వీట్లపై విపరీతంగా స్పందించడమే కాకుండా కామెంట్ల రూపంలో తమ స్పందనను తెలియజేస్తున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో రవిచంద్రన్ అశ్విన్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నాలుగు టెస్టుల్లో కలిపి మొత్తం 25 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. రవీంద్ర జడేజా 22 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఉమ్మడిగా వచ్చింది.

WhatsApp channel