Pujara Record Against Australia: ఆస్ట్రేలియాపై పుజారా రికార్డ్ - ముగ్గురు దిగ్గ‌జాల స‌ర‌స‌న చేరిక‌-cheteshwar pujara completes 2000 runs against australia in tests ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cheteshwar Pujara Completes 2000 Runs Against Australia In Tests

Pujara Record Against Australia: ఆస్ట్రేలియాపై పుజారా రికార్డ్ - ముగ్గురు దిగ్గ‌జాల స‌ర‌స‌న చేరిక‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 11, 2023 01:05 PM IST

Pujara Record Against Australia: ఆహ్మ‌దాబాద్ టెస్ట్‌తో ఆస్ట్రేలియా జ‌ట్టుపై టీమ్ ఇండియా టెస్ట్ స్పెష‌లిస్ట్ ఛ‌టేశ్వ‌ర్ పుజారా అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు. ఆ రికార్డ్ ఏదంటే...

ఛ‌టేశ్వ‌ర్ పుజారా
ఛ‌టేశ్వ‌ర్ పుజారా

Pujara Record Against Australia: టీమ్ ఇండియా టెస్ట్ స్పెష‌లిస్ట్ ఛ‌టేశ్వ‌ర్ పుజారా ఆస్ట్రేలియా జ‌ట్టుపై 2000 ప‌రుగులు పూర్తిచేసుకున్న క్రికెట‌ర్‌గా అరుదైన రికార్డ్ నెల‌కొల్పాడు.

ట్రెండింగ్ వార్తలు

ప్ర‌స్తుతం టీమ్ ఇండియా త‌ర‌ఫున ఆడుతున్న యాక్టివ్ ప్లేయ‌ర్స్‌లో ఈ ఘ‌న‌త‌ను సాధించిన ఏకైక క్రికెట‌ర్‌ పుజారానే కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై రెండు వేల ప‌రుగుల్ని పూర్తిచేసుకున్న నాలుగో టీమ్ ఇండియా ప్లేయ‌ర్‌గా పుజారా నిలిచాడు.

ఇప్ప‌టివ‌ర‌కు స‌చిన్ టెండూల్క‌ర్‌, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, ద్రావిడ్ మాత్ర‌మే ఈ మైలురాయిని అందుకున్నారు. వారి త‌ర్వాత స్థానంలో పుజారా నిలిచాడు. ఆస్ట్రేలియాపై పుజారాకు మంచి రికార్డ్ ఉంది. ఆస్ట్రేలియాతో 24 టెస్ట్‌లు ఆడిన పుజారా 5 సెంచ‌రీలు, 11 హాఫ్ సెంచ‌రీలు సాధించాడు.

ప్ర‌స్తుతం అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతోన్న నాలుగో టెస్ట్ ద్వారా పుజారా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్ర‌స్తుతం టెస్టుల్లో టీమ్ ఇండియా కీల‌క‌మైన ప్లేయ‌ర్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు పుజారా. ఇటీవ‌లే వంద టెస్టుల మైలురాయిని పూర్తిచేసుకున్నాడు.

WhatsApp channel