తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Dance: బ్యాట్ పట్టుకొని అదిరిపోయే స్టెప్పులేసిన కోహ్లి.. వీడియో వైరల్

Virat Kohli Dance: బ్యాట్ పట్టుకొని అదిరిపోయే స్టెప్పులేసిన కోహ్లి.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

14 March 2023, 22:22 IST

    • Virat Kohli Dance: బ్యాట్ పట్టుకొని అదిరిపోయే స్టెప్పులేశాడు విరాట్ కోహ్లి. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. నార్వేకు చెందిన క్విక్ స్టైల్ డ్యాన్స్ గ్రూపుతో కలిసి కోహ్లి డ్యాన్స్ చేశాడు.
నార్వేకు చెందిన క్విక్ స్టైల్ డ్యాన్స్ గ్రూపుతో విరాట్ కోహ్లి
నార్వేకు చెందిన క్విక్ స్టైల్ డ్యాన్స్ గ్రూపుతో విరాట్ కోహ్లి

నార్వేకు చెందిన క్విక్ స్టైల్ డ్యాన్స్ గ్రూపుతో విరాట్ కోహ్లి

Virat Kohli Dance: విరాట్ కోహ్లిలో వరల్డ్ క్లాస్ బ్యాటరే కాదు.. ఓ అదిరిపోయే డ్యాన్సర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని అతడు గతంలోనూ నిరూపించాడు. ఇప్పుడు మరోసారి చేసి చూపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ కోసం ముంబై వెళ్లిన విరాట్.. అక్కడ నార్వేకు చెందిన డ్యాన్స్ గ్రూప్ క్విక్ స్టైల్ తో కలిసి స్టెప్పులేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఈ వీడియోను కోహ్లియే తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. స్టీరియో నేషన్ కు చెందిన ఇష్క్ అనే పాటకు విరాట్ డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోలో గ్రూపులోని ఓ డ్యాన్సర్ కింద ఉన్న బ్యాట్ తీసుకొని చూస్తుంటాడు. ఆ తర్వాత సీన్ లోకి ఎంటరవుతాడు విరాట్. వైట్ టీషర్ట్, బ్లాక్ జీన్స్ లో సింపుల్ గా కనిపించిన కోహ్లి స్టెప్పులు మాత్రం ఆ గ్రూపుతో పోటీగా వేశాడు.

బ్యాట్ పట్టుకొని ఎలా బ్యాటింగ్ చేయాలో వాళ్లకు చూపిస్తూనే అతడీ డ్యాన్స్ చేయడం విశేషం. క్లిక్ స్టైల్ ను విరాట్ కలిస్తే ఇలా ఉంటుంది అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశారు. గంటలోనే ఈ వీడియోకు సుమారు 6 లక్షల వరకూ లైక్స్ వచ్చాయి. దీనికి ఫైర్ ఎమోజీలతో రియాక్టయింది అతని భార్య, నటి అనుష్క శర్మ. విరాట్ 76వ సెంచరీ డ్యాన్స్ ముందే లీకైంది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.

ఎంతోమంది బాలీవుడ్ నటుల కంటే బాగా డ్యాన్స్ చేశావంటూ మరో యూజర్ అనడం విశేషం. అంతకుముందు ఈ డ్యాన్స్ గ్రూపు సభ్యులతోనూ విరాట్ ఓ ఫొటో దిగి దానిని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఇండియన్ పాటలకు డ్యాన్స్ చేస్తూనే నార్వేకు చెందిన ఈ క్విక్ స్టైల్ పాపులర్ అయింది. ఇప్పుడదే ఇండియా టూర్ కు వచ్చారు ఈ గ్రూపు సభ్యులు.

టాపిక్