తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cheteshwar Pujara 100th Test: అరుదైన ఘనతకు అడుగు దూరంలో పుజారా

Cheteshwar Pujara 100th Test: అరుదైన ఘనతకు అడుగు దూరంలో పుజారా

Hari Prasad S HT Telugu

14 February 2023, 15:46 IST

    • Cheteshwar Pujara 100th Test: అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచాడు చెతేశ్వర్ పుజారా. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు అతనికి కెరీర్ లో 100వ టెస్టు కావడం విశేషం.
చెతేశ్వర్ పుజారా
చెతేశ్వర్ పుజారా (PTI)

చెతేశ్వర్ పుజారా

Cheteshwar Pujara 100th Test: చెతేశ్వర్ పుజారా.. ఒకప్పుడు టీమిండియా వాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ రిటైరైన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన ప్లేయర్. ఎప్పుడో 13 ఏళ్ల కిందట జట్టులోకి వచ్చిన అతడు.. ఇప్పుడు ప్రతి క్రికెటర్ కలలు కనే 100వ టెస్టుకు సిద్ధమవుతున్నాడు. కెరీర్ లో చాలా కొద్ది మందికే దక్కే అరుదైన అవకాశం ఇది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

ఆస్ట్రేలియాతో వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 17) నుంచి ప్రారంభం కాబోతున్న రెండో టెస్టు పుజారాకు కెరీర్లో వందో టెస్టు కావడం విశేషం. ఈ ఘనత సాధించనున్న 13వ ఇండియన్ క్రికెటర్ గా పుజారా నిలవనున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న టీమ్ లో విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో క్రికెటర్ గా పుజారా నిలుస్తాడు. విరాట్ గతేడాది మార్చిలో శ్రీలంకతో తన వందో టెస్టు ఆడాడు.

ఇక తన కెరీర్లో భారీగా పరుగులు సాధించిన ఆస్ట్రేలియాపైనే పుజారా ఇప్పుడీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుండటం మరో విశేషం. నిజానికి 2010లో ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన టెస్టులోనే పుజారా అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత మళ్లీ అదే టీమ్ పై 100వ టెస్టు ఆడబోతున్నాడు. తన తొలి మ్యాచ్ లోనే రాహుల్ ద్రవిడ్ ను కాదని పుజారాను మూడోస్థానంలో పంపగా.. అతడు 72 రన్స్ చేశాడు.

దీంతో ఆ మ్యాచ్ లో గెలిచిన ఇండియా సిరీస్ ను 2-0తో సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాపై అతడు 21 టెస్టులు ఆడాడు. అందులో 52.77 సగటుతో 1900 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2018-19లో ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటించినప్పుడు పుజారానే 521 పరుగులతో సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

టీ20 క్రికెట్ బాగా పాపులర్ అయిన తర్వాతే ఇండియన్ టీమ్ లో అడుగుపెట్టిన పుజారా.. మిగతా ప్లేయర్స్ లాగా ఆ ఫార్మాట్ వైపు చూడలేదు. టెస్టు క్రికెట్ కే కట్టుబడి ఉన్నాడు. 99 టెస్టులలో 7021 రన్స్ చేశాడు. అతని సగటు 44.15 కాగా.. అందులో 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గతేడాది టెస్టు టీమ్ లోనూ చోటు కోల్పోయినా.. కౌంటీ క్రికెట్ ఆడి టన్నుల కొద్దీ రన్స్ చేసిన అతడు మళ్లీ టీమ్ లోకి వచ్చాడు.