తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diya: ఇంట్లో ఏ లోహంతో చేసిన దీపం వెలిగిస్తే మంచిది? ఏది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది

Diya: ఇంట్లో ఏ లోహంతో చేసిన దీపం వెలిగిస్తే మంచిది? ఏది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది

Gunti Soundarya HT Telugu

10 September 2024, 11:30 IST

google News
    • Diya: ప్రతి ఒక్కరూ పూజ చేసుకునేటప్పుడు విధిగా దీపం వెలిగిస్తారు. అయితే ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించేందుకు ఏ లోహంతో చేసినది వెలిగిస్తే మంచిది అనేది చాలా మందికి తెలియదు. కొందరు తమ స్తోమతకు తగినట్టుగా మట్టి, వెండి, ఇత్తడి మొదలైన వాటిని వెలిగిస్తారు. 
ఎలాంటి దీపం వెలిగించాలి?
ఎలాంటి దీపం వెలిగించాలి?

ఎలాంటి దీపం వెలిగించాలి?

Diya: చాలా మంది ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. దేవుడి ముందు దీపం వెలిగించిన తర్వాత పనులు ప్రారంభిస్తారు. ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన జరుగుతుందో ఆ ఇంట్లో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి.

లేటెస్ట్ ఫోటోలు

No expiry date foods: ఈ ఆహార పదార్ధాలకు ఎక్స్పైరీ డేట్ లేదు.. తెలుసా..?

Dec 21, 2024, 10:18 PM

Bajaj Chetak EV: సరికొత్త అవతారంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్

Dec 21, 2024, 09:50 PM

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Dec 21, 2024, 07:46 PM

కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఈ రాశుల వారికి బంపర్ లక్.. ధనయోగం, ఇతరుల నుంచి మద్దతు!

Dec 21, 2024, 05:03 PM

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Dec 21, 2024, 04:13 PM

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Dec 21, 2024, 02:59 PM

దీపం జ్యోతి మన చుట్టూ ఉన్న ఏదైనా ప్రతికూల శక్తులను తొలగించేస్తుంది. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. అయితే మీరు దీపం దేనితో వెలిగిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. కొంతమంది పండుగల సమయంలో మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగిస్తారు. ఇంటికి సానుకూలతను ఆకర్షించేందుకు మీరు ఎలాంటి మెటల్ తో చేసిన దీపం వెలిగిస్తున్నారో చూసుకోవాలి. ఇటువంటి వాటితో చేసిన దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సు వస్తుంది.

ఇత్తడి

దీపానికి ఉత్తమమైన లోహం ఇత్తడి. 90శాతం మంది భారతీయులు తమ ఇంటి పూజ గదిలో ఇత్తడి దీపాలు ఉపయోగిస్తారు. ఇవి చాలా మంచివి, ధృడంగా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. సులభంగా తుప్పు పట్టదు. నల్లటి అవశేషాలు మరకలు పడిన తర్వాత శుభ్రం చేయడం కూడా సులభంగా ఉంటుంది. వీటికి సానుకూలతను ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. బ్రైట్ లైట్, గోల్డెన్ కలర్ మిక్స్ తో చక్కగా ఉంటాయి. దీపం వెలిగిస్తే దాని అందం మరింత రెట్టింపు అవుతుంది. ఇత్తడి దీపం ఇంటికి శ్రేయస్సు, సంపద, ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు.

వెండి

దీపం వెలిగించేందుకు వెండి కుందులు కూడా చాలా మంది ఎంచుకుంటారు. వెండి చాలా విలువైనది, పవిత్రమైనది. స్వచ్చత, సమృద్ధికి చిహ్నంగా పరిగణిస్తారు. వెండి దీపాలు మృదువైన మెరుపును ఇస్తాయి. ఇంటి పూజ గదిలో వెండి దీపాలను వెలిగించడం వల్ల ఇళ్లలోకి ప్రశాంతత, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా యజ్ఞాలు, వివాహం వంటి పెద్ద పెద్ద ఆచారాలలో వెండి దీపాలు వెలిగిస్తారు.

రాగి

రాగితో చేసిన వస్తువులతో దీపం వెలిగించడం చాలా అరుదుగా చూస్తుంటారు. ఆయుర్వేదంలో రాగికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా కొందరు వీటిని ఉపయోగిస్తారు. రాగికి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని ఆహ్వానించడంలో సహాయపడుతుంది. ప్రతికూల ప్రభావాలను దూరంగా ఉంచుతుంది. రాగి దియా ఎరుపు గోధుమ రంగు మిక్స్ గా కనిపిస్తుంది. ఇది వెలిగించినప్పుడు అందమైన ప్రకాశాన్ని ఇస్తుంది. కానీ రాగి త్వరగా తుప్పు పడుతుంది. ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేయడం మీద దృష్టి సారించాలి.

మట్టితో చేసిన దీపాలు

లోహాలు కాకుండా దీపం వెలిగించేందుకు ఎక్కువ మంది ఉపయోగించేవి మట్టి ప్రమిదలు. ఇవి ఓదార్పు సువాసనను ఇస్తాయి. మట్టి దీపాలు పర్యావరణ అనుకులమైనవి. ఇవి ఉత్తమమైన ఎంపికల్లో ఒకటి. మట్టి దీపాన్ని వెలిగించి దేవతలను ప్రార్థించడం వల్ల వారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. దీవెనలు కోరేందుకు ఇదొక వినయపూర్వకమైన మార్గంగా పరిగణిస్తారు.

దీపం ప్రాముఖ్యత

దీపం వెలిగించడం అనేది ఏదైనా ఆచారానికి నాంది పలకడం. దైవిక శక్తులను ఆహ్వానించడం. దీపాలు వెలుతురు, ప్రకాశాన్ని అందిస్తాయి. పర్యావర్ణాన్ని శుద్ది చేస్తాయి. సానుకూల,దైవిక శక్తులను ఆకర్షిస్తుంది. వివిధ లోహాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఇత్తడితో చేసిన దీపాలు మాత్రం సానుకూల శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. చీకటి గదిలో దీపం వెలిగించడం వల్ల ప్రకాశవంతంగా మారుతుంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపం వెలిగించడం వల్ల ఎలాంటి చీకటీనైనా తొలగిస్తుంది.

తదుపరి వ్యాసం