Fragrant lamps: ఈ సువాసనాభరితమైన దీపాలు ఇంట్లో వెలిగిస్తే సంతోషం, ప్రేమ, సానుకూలత నిండిపోతుంది
Fragrant lamps: ఇంటిని సువాసన భరితంగా మార్చుకునేందుకు అగరబత్తి వెలిగిస్తారు. అలాగే ఎయిర్ ఫ్రెషనర్స్ కూడా పెట్టుకుంటారు. మీ ఇంట్లో సంతోషం, ప్రేమ, సానుకూలత కోసం ఈ సువాసనాభరితమైన దీపాలు వెలిగించడం లేదా వీటిని స్ప్రే చేయడం మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
Fragrant lamps: ఇంట్లో సానుకూలత ఏర్పడేలా చేసేందుకు అందరూ ప్రయత్నిస్తారు. అందుకోసం ఎటువంటి వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటారు. నెగటివ్ ఎనర్జీ ఇంటి ఆర్థిక, వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ ఉండాలని సూచిస్తారు.
ప్రతి రోజు ఏ ఇంట్లో అయితే దీపారాధన సక్రమంగా జరుగుతుందో ఆ ఇంటి మీద దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఇంటిని సువాసన భరితంగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ పూజలో భాగంగా కర్పూరం, అగరబత్తి వెలిగిస్తూ ఉంటారు. వీటినుంచి వెలువడే సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. చెడు శక్తులను ఇంట్లో నుంచి తరిమికొట్టడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సువాసన పరిమళాలు మీ ఇంటికి ఆనందాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
వాస్తు ప్రకారం కొన్ని రకాల సుగంధ పరిమళాలు కుటుంబానికి శ్రేయస్సును అందిస్తాయి. వీటిని మీ ఇంటి మూలల్లో చేర్చడం వల్ల భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంపొందించే వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటి ప్రభావవంతమైన సువాసన సమతుల్యతను ఇస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఆనందం, సానుకూలత, ప్రేమ, సంపదను ఆకర్షించడంలో సహాయపడే ఐదు అద్భుతమైన సుగంధ పరిమళాల గురించి తెలుసుకుందాం.
చందనం
శివునికి ఎంతో ప్రీతికరమైనది చందనం. గంధపు చెక్క సువాసన శ్రేయస్సు, సానుకూలతను ఆకర్షిస్తుంది. విశ్రాంతి, ప్రశాంతతను ప్రోత్సాహిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. సంపద, విజయాన్ని మెరుగుపరుచేందుకు మీ ఇల్లు లేదా కార్యాలయంలో ఆగ్నేయ మూలలో చందనం ధూపం లేదా నూనెతో దీపం వెలిగించడం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చందనం స్ప్రే కూడా చేయవచ్చు.
జాస్మిన్
జాస్మిన్ సువాసన సంపద, విజయం, ఆనందాన్ని తీసుకొస్తుంది. ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తుంది. దీని సువాసన సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. ఇంట్లో ప్రేమ సంబంధాలు మెరుగుపరిచేందుకు నైరుతి మూలలో మల్లె పువ్వులను ఉంచాలి. లేదా జాస్మిన్ ఆయిల్ తో దీపం వెలిగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే జాస్మిన్ స్ప్రే కూడా చేసుకోవచ్చు.
లావెండర్
లావెండర్ సువాసన శాంతి, ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. దీని సువాసన ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. విశ్రాంతిని ఇస్తుంది. మానసిక స్పష్టతను, ప్రశాంతతను మెరుగుపరిచేందుకు మీ ఇంటి వాయువ్య మూలలో లావెండర్ ఆయిల్ తో దీపం వెలిగించడం లేదా పువ్వులను ఉపయోగించడం చేయండి.
గులాబీ
గులాబీ సువాసన ప్రేమ, సామరస్యాన్ని రూపొందిస్తుంది. గులాబీ పూల వాసన సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. విశ్రాంతిని, ప్రశాంతతను ప్రోత్సహిస్తుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల సంబంధాలను పెంపొందించడానికి ఇంటి ఈశాన్య మూలలో గులాబీ పువ్వులు పెట్టడం లేదంటే గులాబీ పరిమళం స్ప్రే చేసుకోవచ్చు. గులాబీ నూనె ఉపయోగించి దీపం వెలిగించవచ్చు.
సుగంధ ద్రవ్యాలు
సుగంధ ద్రవ్యాల సువాసన పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధిని, సమృద్ధిని ప్రోత్సహిస్తుంది. వీటి సువాసన ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించుకునేందుకు మీ ఇంటి ఉత్తర మూలలో దీన్ని స్ప్రే చేయడం లేదా వాటి నూనెతో దీపం వెలిగించడం మంచిది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్