Sun nakshatra transit: పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు- ఈ రాశుల వారికి సంపద, శ్రేయస్సు లభిస్తుంది-sun transit in purva phalguni nakshtram from september 30th four zodiac signs get wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sun Nakshatra Transit: పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు- ఈ రాశుల వారికి సంపద, శ్రేయస్సు లభిస్తుంది

Sun nakshatra transit: పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి సూర్యుడు- ఈ రాశుల వారికి సంపద, శ్రేయస్సు లభిస్తుంది

Gunti Soundarya HT Telugu
Sep 09, 2024 06:49 PM IST

Sun nakshatra transit: సూర్యుడు మరికొద్ది రోజుల్లో తన నక్షత్రాన్ని మారుస్తాడు. పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల నాలుగు రాశుల వారికి అదృష్టం, సంపద, శ్రేయస్సు లభిస్తాయి. నెల రోజుల పాటు వీరికి ధనానికి కొదువ ఉండదు.

నక్షత్రం మారబోతున్న సూర్యుడు
నక్షత్రం మారబోతున్న సూర్యుడు

Sun nakshatra transit: వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు 12 రాశిచక్ర గుర్తులు, నక్షత్రాలలో సంచరిస్తాయి. సూర్యుడు తన నక్షత్రంతో పాటు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. 30 సెప్టెంబర్ 2024న సూర్యుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శుక్రుడి మధ్య విరోధ సంబంధం ఉంది. అయితే సూర్యుడు శుక్రుడి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలంలో కొన్ని రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది. సూర్యుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు స్థానికుల వృత్తి, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ శుభ ఫలితాల సూచనలు ఉన్నాయి. ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయో చూద్దాం.

మేష రాశి

మేష రాశి వారు ఈ సూర్య సంచారము వలన వారి జీవితాలలో అన్ని రకాల విలాసాలు సుఖాలు పొందుతారు. వారు తమ కార్యాలయంలో అనుకూలమైన ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగస్తులు కొన్ని కొత్త పని బాధ్యతలను పొందవచ్చు. స్థానికులు మంచి ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు. ఈ కాలంలో వారి జీతం పెరగవచ్చు. ఆర్థిక స్థితి బలపడుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులకు కలిసి వస్తుంది. వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు అనుకూలమైన సమయం. కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి ప్రేమ పెరుగుతుంది.

సింహ రాశి

సూర్యుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో ప్రవేశించినందున, సింహ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో వారు ఉత్సాహం, శక్తితో నిండి ఉంటారు. సమాజంలో వారి గౌరవం పెరుగుతుంది. మీ జీవనశైలిలో సానుకూల మార్పులు ఉంటాయి. మాట తీరు మెరుగుపడుతుంది. ఈ సూర్య సంచారము వలన కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపార రంగంలో లాభాలను ఆర్జించే అవకాశాన్ని పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. అధిక లాభాలను ఆర్జించడానికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది.

కన్యా రాశి

సూర్య సంచారం కన్యా రాశి వారి జీవితాల్లో సంతోషం ఉంటుంది. ఈ కాలంలో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. పనిలో వారి అడ్డంకులు అన్నీ ఇప్పుడు తొలగిపోవచ్చు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కెరీర్‌లో చాలా పురోగతి సాధిస్తారు. భవిష్యత్తులో వారికి ప్రయోజనకరంగా ఉండే ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకోవడంలో విజయం సాధిస్తారు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. కొన్ని ప్రభుత్వ సంస్థల వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి.

తులా రాశి

సూర్యుడి నక్షత్ర మార్పు వల్ల తులా రాశి వాళ్ళు చాలా లాభపడతారు. ఆధ్యాత్మికతపై వారి ఆసక్తి పెరుగుతుంది. మతపరమైన, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసిక ఒత్తిడితో ఇబ్బందుల నుంచి బయటపడతారు. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. వ్యాపార వ్యక్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. జీవిత భాగస్వామికి మీకు మధ్య సంబంధం మరింత బలపడుతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.